నాని ని ప్రోత్సహిస్తున్న కాజల్, రవితేజ, నిత్యా మీనన్!

అసిస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అనుకోకుండా హీరో అయి నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. వరుసగా ఏడు విజయాలు అందుకొని మరో మూడు ప్రాజక్ట్ లను లైన్లో పెట్టారు. ఇంత బిజీలో ఉన్నప్పటికీ ప్రశాంత్ చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా అవతారం ఎత్తారు. వాల్ పోస్టర్ పేరుతొ ఓ బ్యానర్ ని మొదలు పెట్టి .. అ! పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని పనికి స్టార్ హీరోలు హీరోయిన్లు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆలా మొదలయింది సినిమాలో నానితో కలిసి నటించిన నిత్యామీనన్ ఈ సినిమాలో ఓ కీలకరోల్ పోషించడానికి ముందుకు వచ్చారు.

ఆమెతో పాటు అసిస్టెంట్ డైరక్టర్ గా వచ్చి మాస్ మహా రాజ్ గా మారిన రవితేజ కూడా గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కాజల్ అగర్వాల్ కూడా సినిమాలో తళుక్కున మెరవనుంది. కొత్తవారితో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ఈ స్టార్ హీరోలు పెద్ద బలం కానున్నారు. నిత్యా మీనన్ ఉన్న ఓ పోస్టర్ ను  లేటెస్ట్ గా విడుదల చేయడంతో ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ పెరిగింది.  ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్త చేసుకున్న ఈ చిత్రం యువతని ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus