Ravi Teja: శ్రీను వైట్ల సినిమాను రవితేజ అంత మాట అనేశాడేంటి?

కథల ఎంపిక మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు చాలా పక్కాగా ఉంటారు అని టాక్‌. అందుకే వాళ్ల సినిమాల విజయాల శాతం ఎక్కువ అని చెబుతుంటారు. కావాలంటే ఒకసారి వాళ్ల ఫిల్మోగ్రఫీ లిస్ట్‌ చూస్తే అదే అర్థమవుతుంది. అయితే బోల్తా కొట్టిన సినిమాలూ ఉన్నాయి.కానీ చెప్పాంగా చాలా తక్కువ. అలాంటి ఓ సినిమా గురించి రవితేజ ఇటీవల కామెంట్‌ చేశాడు. ‘రాడ్డులకే రాడ్డు’ అంటూ ఘనంగా కీర్తించాడు కూడా. ‘ఆహా’లో ప్రసారమవుతున్న బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోకి రవితేజ ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే. అందులోనే ఈ కామెంట్స్‌ చేశాడు.

రవితేజ ఫ్లాప్‌ల గురించి ఈ షోలో చర్చ వచ్చింది. కెరీర్‌లో ఫ్లాప్‌లను ఎలా తీసుకుంటావు అని మాటకు… రవితేజ చాలా కూల్‌గా పెద్దగా మనసులోకి తీసుకోను అని చెప్పాడు. అయితే అక్కడికి కాసేపటికే ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా గురించి ‘రాడ్డు’ అంటూ గాలి తీసేశాడు. నిజానికి ఆ సినిమా రవితేజకు చాలా పెద్ద మైనస్‌ అని చెప్పాలి. సరైన హిట్‌ లేని సమయంలో శ్రీను వైట్ల ఆ కథలో రవితేజ వద్దకు వచ్చారు. కథ విన్నాక సినిమా ఓకే చేసినా… ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. అయితే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స నిర్మించిందనే విషయం తెలిసిందే.

సినిమాల కథల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే మైత్రీ వాళ్లు ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ విషయంలో ఎందుకు తప్పులో కాలేశారో తెలియడం లేదు. అయితే అప్పటి వరకు సోలోగా సినిమాలు రూపొందించిన మైత్రీ వాళ్లు తొలిసారి వేరే నిర్మాణ సంస్థతో కలసింది ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’కే. దాంతో ఎక్కడా కాంప్రమైజ్‌ అయ్యి కథ ఓకే అయ్యిందనుకోవచ్చా అనే డౌట్స్‌ కూడా ఉన్నాయి అన్నట్లు ఆ తర్వాత ఇలానే కొలాబ్‌లో చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా అదే దారిలో పరాజయం పాలైంది. అయితే ‘ఉప్పెన’ కొలాబ్‌ను హిట్‌ కాంబోగా మార్చుకుంది మైత్రీ టీమ్‌.

ఇక ఈ సినిమా ఫలితం – శ్రీను వైట్ల గురించి మాట్లాడటం ఎక్కువే. ఎందుకంటే ఆయన కథల విషయంలో కొత్తదనం లేకే వరుస ఫ్లాప్‌లు వస్తున్నాయి. అలా వచ్చిన ఫ్లాప్‌ల్లో ఈ సినిమా కూడా ఒకటి అనుకోవచ్చు. ఆ లెక్కన రవితేజ ‘రాడ్డు’ అన్న సినిమా శ్రీను వైట్లకు ఇంకా పెద్ద రాడ్డేమో కదా.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus