సరికొత్త అవతారం ఎత్తనున్న రవితేజ..!

ఇప్పటికే మహేష్ బాబు ‘జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్’ ను స్థాపించి తన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. అంతేకాదు అడివిశేష్ తో ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తూనే… శర్వానంద్ తో కూడా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. మరోపక్క రాంచరణ్ కూడా తన తండ్రితో ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు నిర్మించాడు. ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు చరణ్. త్వరలోనే ఎన్టీఆర్ కూడా తన సొంత బ్యానర్ ను స్థాపించి సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు వీరి బాటలోనే మన మాస్ మహారాజ్ రవితేజ కూడా అడుగులు వెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.అవును.. రవితేజ కూడా నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నాడట. ఇప్పటికే తన సన్నిహితులతో ఈ విషయం పై డిస్కషన్లు జరిపాడట రవితేజ. ట్యాలెంట్ ఉన్న యువ రైటర్లను.. డైరెక్టర్లుగా పరిచయం చేస్తూ.. చిన్న హీరోలతో సినిమాలు రూపొందించాలని రవితేజ ప్లాన్ చేస్తున్నాడట. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ గా ఎదిగాడు రవితేజ.

ఇప్పటికే చాలా మందికి డైరెక్టర్లకు మొదటి ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, బాబీ వంటి డైరెక్టర్లు ఇప్పుడు స్టార్లుగా ఎదిగారు.. అయితే వారికి మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా రవితేజనే.! ఇప్పుడు నిర్మాతగా కూడా మారి మరికొంత మంది ట్యాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చెయ్యాలని రవితేజ భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus