ఆ రెండు చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’..?

‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లందుకుని… ఈ సంక్రాంతికి ‘ఎఫ్2’ చిత్రంతో మరో హిట్టు కొట్టి అపజయమెరుగని దర్శకుల లిస్టులో చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ, తరువాత ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది అనిల్ రావిపూడి మాత్రమే. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 50 కోట్ల షేర్ ను దాటేసింది. వెంకీ కామెడీ, వరుణ్ తేజ్ నటన.. తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టాయి.

ఇక ఈ చిత్రం ఎండ్ కార్డులో ‘ఎఫ్3’ ఉండబోతుందని హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని ‘ఎఫ్2’ సక్సెస్ మీట్లో వరుణ్ తేజ్ కూడా స్పష్టం చేసాడు. అయితే ఈ సీక్వెల్ పై అప్పుడే చాలా కథలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగా… మాస్ మాహారాజ్ ర‌వితేజ హీరోగా వచ్చిన `రాజా ది గ్రేట్‌`తోనూ, విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల `ఎఫ్2`చిత్రంతోనూ కలిపి ‘ఎఫ్3’ సీక్వెల్ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో వెంక‌టేష్‌, ర‌వితేజ, వ‌రుణ్ తేజ్ ముగ్గురూ కలిసి నటించబోతున్నారట. ఇందులో కూడా ర‌వితేజ ‘బ్లైండ్’ గా కనిపించబోతున్నాడట.

ఈ చిత్రంలో మెహ్రీన్ డబుల్ రోల్ లో కనిపించబోతుందట. ఈ చిత్రానికి కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడట. బాలీవుడ్ ‘గోల్ మాల్’ రేంజ్ లో ఈ చిత్రాన్ని రూపొందించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. ‘ఎఫ్2’ కి మించి ఎక్కువ ఫన్ ఈ చిత్రంలో ఉండబోతుందట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనిలోనే అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడట. త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టి… వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ ‘ఎఫ్3’ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనిల్ రావిపూడి.. దిల్ రాజు లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus