Khiladi Teaser: రవితేజ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మాస్ మహరాజ రవితేజ. ఈ ఏడాది అతని నుండీ రాబోతున్న మరో చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల పై సత్యనారాయణ కోనేరు అలాగే రమేష్ వర్మ కలిసి నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం(డబుల్ రోల్) చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

ఇప్పటికే విడుదల చేసిన ‘ఖిలాడీ’ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ లకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా ఉగాది పండుగ సందర్బంగా ‘ఖిలాడి’ టీజర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. రవితేజకు ఇది 67వ చిత్రం కావడం విశేషం. టీజర్ చూస్తుంటే ఇది యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని స్పష్టమవుతుంది.రవితేజ ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్నట్టు కూడా టీజర్ స్పష్టం చేస్తుంది. అనసూయ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

అలాగే కోలీవుడ్ హీరో అర్జున్ కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్ కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ముఖ్యంగా టీజర్ ఎండింగ్లో.. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్ స్టాపబుల్’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ తరువాత వచ్చే బి.జి.ఎం కి గూజ్ బంప్స్ రావడం గ్యారెంటీ అనే చెప్పాలి. టీజర్ ఆకట్టుకునే విధంగానే కట్ చేసాడు దర్శకుడు. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus