మాస్ మహారాజ్ రవితేజ నటించిన గత 10 సినిమాల కలెక్షన్ల లిస్ట్..!

భూపతి రాజు రవిశంకర్ రాజు.. ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అదే రవితేజ అంటే మాస్ మహారాజ్ కదా అంటారు. అంతలా రవితేజను ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఓ లైట్ మెన్ గా కెరీర్ ను ప్రారంభించి… తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు పోషించేవాడు రవితేజ. ఒకప్పుడు రవితేజ ఏ హీరోల సినిమాల్లో అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడో.. తర్వాత రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఆ హీరోలు సైడ్ క్యారెక్టర్లు వేయడం కూడా జరిగింది. ఉదాహరణకి బ్రహ్మాజీ, జె.డి.చక్రవర్తి, జగపతి బాబు వంటి వారు అన్న మాట.

ఇక హీరోగా మారిన తర్వాత రవితేజ.. గొప్పలకు పోయి పెద్ద డైరెక్టర్ల సినిమాల్లో మాత్రమే నటించలేదు. కొత్త డైరెక్టర్లకు, ప్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తూ వచ్చాడు. బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, శ్రీనువైట్ల, బాబీ,హరీష్ శంకర్ వంటి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చింది రవితేజనే..! రవితేజ పరిచయం చేసిన దర్శకుల్లో అతనికి ప్లాపులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని రవితేజ కొత్త దర్శకులను పరిచయం చేయడం మానలేదు. గత 4,5 ఏళ్లలో విజయ్ దేవరకొండ వంటి ఎంతో మంది యువ హీరోలు ఎంట్రీ ఇచ్చారు.

కానీ రవితేజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రవితేజ పని ఇక అయిపోయింది అనుకున్న టైంలో ఓ బ్లాక్ బస్టర్ కొట్టి అందరి నోర్లు మూయిస్తూ ఉంటాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి..ఈరోజు రవితేజ పుట్టినరోజు కావడంతో రవితేజ నటించిన గత 10 సినిమాలు మరియు వాటి కలెక్షన్లు.. ఫైనల్ గా వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బెంగాల్ టైగర్ :

రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.23 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది.

2) రాజా ది గ్రేట్ :

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.29.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.30.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది.

3) టచ్ చేసి చూడు :

రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.9.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.

4) నేల టిక్కెట్ :

రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.9.8 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.

5) అమర్ అక్బర్ ఆంటోనీ:

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.6.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.

6) డిస్కో రాజా:

రవితేజ హీరోగా వి. ఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.8 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.

7) క్రాక్ :

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.18 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.39.16 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

8) ఖిలాడి:

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.22.3 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.13.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

9) రామారావు ఆన్ డ్యూటీ:

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

10) ధమాకా :

రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.20.70 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.44 కోట్ల షేర్ ను రాబట్టి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

వాల్తేరు వీరయ్య లో కూడా రవితేజ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా రూ.120 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అయితే ఇది పూర్తిగా రవితేజ మార్క్ మూవీ కాదు. కాబట్టి ఈ సినిమా కలెక్షన్లను రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ అనలేము.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus