విభిన్నమైన కథకి ఓకే చెప్పిన మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీను వైట్ల కలయికలో ఇప్పటికే నీకోసం, వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాలు వచ్చాయి. ఇవి మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరి కలయికలో రూపుదిద్దుకుంటున్న నాలుగో సినిమా “అమర్ అక్బర్ ఆంటోని”. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా హైదరాబాద్ చిత్రపురి కాలనీ పరిసరాల్లోని సన్ షైన్ ఆస్పత్రిలో రవితేజపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాత రవితేజ.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది.

టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో విభిన్నమైన అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇతను రవితేజని కొత్తగా చూపించనున్నట్టు తెలిసింది. “టైమ్ మిషన్” నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. గతంలో టైమ్ మిషన్ నేపథ్యంలో “ఆదిత్య 369 ” సినిమా వచ్చి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అటువంటి సాహసం ఎవరూ చేయలేదు. మళ్ళీ రవితేజ చేస్తున్నారు. అయితే ఈ కథ మరో కోణంలో కొనసాగుతుందని టాక్. నభా నటేశ్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రయోగం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus