కళ్యాణ్ కృష్ణతో రవితేజ సినిమా చేయనున్నారా?

మాస్ మహారాజ్ రవితేజ అంధుడిగా నటించిన “రాజా ది గ్రేట్” ఈరోజు రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విజయాన్ని ఆనందించే తీరిక రవితేజకి లేదు. ఎందుకంటే రెండేళ్లు తీసుకున్న గ్యాప్ ని పూడ్చడానికి ఒకేసారి రెండు సినిమాలను ప్రారంభించిన ఈ హీరో, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమాని త్వరలో కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే తాజా సమాచారం మేరకు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథకు రవితేజ ఓకే చెప్పిన్నట్లు తెలిసింది.

కళ్యాణ్ కృష్ణ… నాగార్జునతో “సోగ్గాడే చిన్నినాయన” సినిమా తీసి హిట్ అందుకున్నారు. రెండో సినిమాని నాగ్ తనయుడు నాగ చైతన్యతో “రారండోయ్ వేడుక చూద్దాం” చేసి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మళ్లీ నాగార్జునతో “బంగ్గార్రాజు” సినిమా తెరకెక్కించాలని చూస్తున్న కళ్యాణ్ కృష్ణ రీసెంట్ గా రవితేజకి స్టోరీ చెప్పారంట. అది నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని ప్రోత్సహించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus