సినిమాలు పెద్దలకే కాదు పిల్లలకోసం కూడా. వారిని కూడా ఆనందింపజేసే సినిమాలు కచ్చితంగా విజయతీరాన్ని చేరుతాయి. అందుకే నేటి దర్శకులు సినిమాల్లో చిన్న పిల్లలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సుప్రీమ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రాల్లో చిన్నపిల్లలా చుట్టూనే కథ నడుస్తుంది. అందుకే బాల నటులకు మంచి అవకాశాలొస్తున్నాయి. ‘జోరు’, ‘జనతాగ్యారేజ్’, ‘అ.. ఆ’ ఇటీవల ‘రాజా ది గ్రేట్’ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నారి సంస్కృతి నటించి అందరి మెప్పు అందుకుంది. ఈ బాలనటి హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రనోత్సవానికి హాజరైంది.
అనేక విషయాలను పంచుకుంది. ‘ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం కొత్త అనుభూతి కలిగించింది. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాను.” అని వివరించింది. ఇంకా మాట్లాడుతూ .. ‘‘నేను నాలుగో తరగతి చదువుతున్నా. డాన్స్ , యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ‘రాజా ది గ్రేట్’లో మెహరీన్ చిన్నప్పటి పాత్ర చేశా. అందులో నా నటన చూసి రవితేజ అంకుల్ ‘ఇరగదీశావ్’ అన్నారు’’ అని సంస్కృతి ఆనందంగా చెప్పింది.