శ్రీను వైట్ల సినిమాలో రవితేజ రోల్ ఇదేనా ?

రాజా ది గ్రేట్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ మూవీ ఫిబ్రవరి మొదటి వారంలో లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే సోగ్గాడే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాని రవితేజ మొదలు పెట్టారు. “నేల టికెట్” అని పేరు పరిశీలిస్తున్నా ఈ చిత్రాన్ని అంతే వేగంతో పూర్తి చేయడానికి రవితేజ ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే తనకి కెరీర్ మొదట్లో సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్లకి డేట్స్ ఇచ్చారు.

వీరిద్దరి కలయికలో ఓ మూవీ తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో రవితేజ ఎన్నారైగా కనిపించనున్నట్టు సమాచారం. అందుకే ఈ చిత్రం ఎక్కువభాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాని చేయడానికి రవితేజ చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. శ్రీనువైట్ల చెప్పిన స్క్రిప్ట్ చాలా నచ్చిందని, ఫ్యామిలీ డ్రామా మూవీలో హాస్యాన్ని జోడించిన విధానం అద్భుతంగా ఉందని టాక్. ఈ సినిమా ఎప్పుడెప్పు మొదలవుతుందా? అని అభిమానులతో పాటు రవితేజ వెయిట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus