ఈ బ్రేక్ మాంచి కిక్ ఇచ్చింది : మాస్ మహారాజా రవితేజ

  • July 8, 2020 / 12:03 PM IST

“బెంగాల్ టైగర్” అనంతరం రెండేళ్ల విరామం తీసుకొని రవితేజ నటించిన తాజా చిత్రం “రాజా ది గ్రేట్”. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన మెహరీన్ కథానాయికగా నటించింది. విడుదలైన ట్రైలర్ తోపాటు సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకొన్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదలకానుంది. ఇంకో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుండగా.. రవితేజ “రాజా ది గ్రేట్” విశేషాలను మీడియాతో పంచుకొన్నారు.

ఆ ఆలోచన అనిల్ రావిపూడిదే..
“రాజా ది గ్రేట్”లో చిన్నప్పటి రవితేజగా నా తనయుడు మహాధన్ ను నటింపజేయాలనే ఆలోచన అనిల్ దే. నేను వద్దన్నప్పటికీ తానే కన్వీన్స్ చేసి మరీ మహాధన్ ను సినిమాలో యాక్ట్ చేయించాడు అనిల్. మహాధన్ వయసు 10 ఏళ్ళు, నాకంటే సినిమా గురించి వాడే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. వాడ్ని వాడు తెరపై చూసుకోడానికి మహాధన్ బాగా ఎగ్జయిటెడ్ గా ఉన్నాడు.

అనిల్ చెప్పిన పాయింట్ నచ్చింది..
దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకొని నేను నటించిన సినిమా “రాజా ది గ్రేట్”. నా అభిమానులు సంతోషపడడమే కాదు.. ఒక కథానాయకుడిగా నేను కూడా సాటిస్ఫై అవ్వాలి. చాలా కధలు విన్నాను అన్నీ రెగ్యులర్ గానే అనిపించాయి. అయితే.. అనిల్ చెప్పిన స్టోరీ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా అంధుడి పాత్ర పోషించాలన్నప్పుడు భలే కిక్ అనిపించింది.

ఈ రెండేళ్ల గ్యాప్ చాలా నేర్పింది..
ఎప్పుడూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేసే నేను సడన్ గా రెండేళ్లు కనిపించకపోయేసరికి అందరూ దాదాపు షాక్ అయిపోయారు. నేను ఇంక సినిమాలు చేయడం మానేశానని కొందరు, రిటర్మెంట్ తీసుకొన్నాని ఇంకొందరు అనుకోవడం మొదలెట్టారు. కానీ.. నేను వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే.. దాదాపు 20 ఏళ్ళు నిర్విరామంగా పనిచేసిన తర్వాత కనీసం ఓ రెండేళ్లు నాకోసం నేను వెచ్చించుకోలేనా అనిపించింది. ఎవరేమనుకొన్నా నేను మాత్రం ఈ గ్యాప్ ను బాగా ఎంజాయ్ చేశాను.

మెహరీన్ చాలా టాలెంటెడ్..
నేను చాలామంది కొత్త హీరోయిన్స్ తో యాక్ట్ చేశాను కానీ.. మెహరీన్ చాలా టాలెంటెడ్. సన్నివేశాన్ని అర్ధం చేసుకొని అవసరమైన ఎక్స్ ప్రెషన్ మాత్రమే ఇచ్చేది. చాలా కొద్దిమందికి మాత్రమే ఆ నేర్పు ఉంటుంది. తప్పకుండా మెహరీన్ అగ్ర స్థానానికి చేరుకుంటుంది.

జస్ట్ నటించాను ఆంతే..
ఒక అంధుడిగా నేను కేవలం నటించాను. అందుకోసం కొందరు అంధుల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ.. మరీ ఎక్కువ కష్టపడడం మాత్రం జరగలేదు. ఎందుకంటే నటన నాకు కొత్త కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను కళ్ళు మూసుకొన్నా.. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది. అందువల్ల నాకు పెద్ద ఇబ్బంది కలగలేదు.

దిల్ రాజు ది ఫిలిమ్ మేకర్..
సినిమా నిర్మించడం వేరు, సినిమాను ప్రేమించడం వేరు. దిల్ రాజు రెండో వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యి అనుక్షణం బెటర్ అవుట్ పుట్ కోసం పరితపిస్తుంటారు. అందుకే ఆయన బ్యానర్ లో అన్ని హిట్ సినిమాలోచ్చాయి.

శ్రీనివాసరెడ్డితో నాకు ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ..
ఇప్పటివరకూ ఎంతమంది సీనియర్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్స్ తో కలిసి వర్క్ చేసినా.. శ్రీనివాసరెడ్డితో కలిసి యాక్ట్ చేసినప్పుడు పండినంత కామెడీ మాత్రం ఎప్పుడూ పండలేదు. అతనితో నాకు కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. అలాగే అనిల్ రావిపూడికి కూడా శ్రీనివాసరెడ్డితో మంచి ర్యాపో ఉండడంతో “రాజా ది గ్రేట్”లో మా కాంబినేషన్ లో కామెడీ విశేషంగా పండింది.

ఇంత కాన్ఫిడెంట్ గా ఎప్పుడూ లేను..
నా కెరీర్ మొత్తంలో నేను ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఎప్పుడూ లేను. మరీ టెన్షన్ పడకపోయినా.. జనాలు ఎలా రిసీవ్ చేసుకొంటారో అన్న ఆలోచన ఉండేది. అయితే.. “రాజా ది గ్రేట్” మాత్రం ష్యూర్ షాట్ హిట్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను. అక్టోబర్ 18న సినిమా చూశాక మీరు, ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus