నిన్న సాయంత్రం సడన్ గా ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్ కి కంటి చెకప్ కోసం వచ్చిన కొందరికి చిన్న షార్ట్ వేసుకొని, టీషర్ట్ లో ఓ కుర్రాడు కనపడ్డాడు. చూసినోళ్ళందరూ “ఎక్కడో చూసినట్లుందే” అనుకుంటున్నారు కానీ.. ఎక్కడ చూశారు అన్నది మాత్రం గుర్తురావడం లేదు. కరెక్ట్ గా అదే సమయానికి ఎవరో వెనుక నుంచి “రవితేజ గారూ…” అని గట్టిగా పిలిచేసరికి జనాలందరికీ ఒక్కసారిగా బల్బ్ వెలిగింది. అవును ఆయన మన మాస్ మహారాజా రవితేజ అనే విషయం గుర్తొచ్చింది. వెటనే ఆయన వద్దకి వెళ్లడానికి ప్రయత్నించారు కానీ ఆయన అప్పటికే కారు ఎక్కేసి లోపలికి వెళ్లిపోయాడు.
ఇంతకీ రవితేజ ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర ఏం చేస్తున్నాడా అని ఆరా తీయగా.. పక్కనే ఉన్న ప్రసాద్ ల్యాబ్స్ లో తన తాజా చిత్రం “నేల టికెట్టు” కోసం డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడని తెలిసింది. అయితే.. సామాన్యులకు ల్యాబ్ లో ఎంట్రీ లేకపోవడంతో గేట్ దాకా వచ్చినవాళ్ళందరూ వెనుదిరిగారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ-మాళవిక జంటగా తెరకెక్కుతున్న “నేల టికెట్టు” చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టింది చిత్రబృందం. “టచ్ చేసి చూడు”తో డిజాస్టర్ చవిచూసిన రవితేజ “నేల టికెట్టు”పై భారీ అంచనాలు పెట్టుకొన్నాడు