2018వ సంవత్సరంలోనే నందమూరి బాలకృష్ణని కలిసి ఓ కథ వినిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దానికి ‘రామారావు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. బాలకృష్ణ సొంత బ్యానర్ అయిన ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ సమర్పణలో ఓ పెద్ద సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించాలని ప్లాన్ చేసింది.అయితే అప్పుడు బాలయ్య.. తన తండ్రి ‘ఎన్టీఆర్ బయోపిక్’ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టారు. అటు తర్వాత అనిల్ రావిపూడికి ఊహించని విధంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడంతో మరింత గ్యాప్ ఏర్పడింది.
అయితే ఆ ‘రామారావు’ టైటిల్ ను ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ సినిమాకి ఫిక్స్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో రవితేజ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రవితేజకి 68వ చిత్రం. అయితే దీనికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ టైటిల్ ను జనాలు ‘రామారావు’ అనే పిలుస్తారు.
సిన్సియర్ మరియు సీరియస్ కాప్ గా రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.ఇందులో అతని పాత్ర పేరు బి. రామారావు అని తెలుస్తుంది.యాదృశ్చికమో ఏంటో తెలీదు కానీ.. ప్రతీసారి బాలయ్య, రవితేజలకు పోటీ పడుతూనే ఉంటుంది. అలా పోటీపడిన ప్రతీసారి రవితేజనే పై చేయి సాధిస్తూ ఉంటాడు.