రవితేజ టాప్ 11 బెస్ట్ రోల్స్

  • January 25, 2018 / 09:39 AM IST

నెవర్ గివ్ అప్.. ఇదే రవితేజ విజయమంత్రం. ఇష్టమైనది సాధించేవరకు వదలొద్దనేది అతను అందరికీ చెబుతుంటారు. అలా కష్టపడ్డారు కాబట్టే చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా మాస్ మహారాజ్ గా ఎదిగారు. నేడు (జనవరి 26 ) ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రవితేజ నటించిన చిత్రాల్లో ఆకట్టుకున్న పాత్రలపై ఫోకస్..

సింధూరం రవితేజ చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా… తొలి సారి ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా “సింధూరం”. 1997 లో వచ్చిన ఈ మూవీలో రవితేజ్ చేసిన “చంటి” పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

వెంకీ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ మూవీ రవితేజను మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గర చేసింది. ఇందులో రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతహా అనిపించుకుంది. యాక్షన్ సీన్స్, డ్యాన్సులు మాస్ ప్రేక్షుకులను ఉర్రూతలూగించాయి.

ఇడియట్ ఈ సినిమాలో రవితేజ పోషించిన చంటి పాత్రకు యువకులు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. చంటిగాడు.. లోకల్ అంటూ సాధారణమైన యువకుడిలా అతని నటన సూపర్. అందుకే ఈ చిత్రాన్ని విద్యార్థులు సూపర్ హిట్ చేయించారు.

నా ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ సినిమా చూస్తుంటే చిన్నప్పటి నుంచి మనం రాసుకున్న డైరీలను తిరిగేసినట్టు ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను రవితేజ తన నటనతో గుర్తు చేశారు.

విక్రమార్కుడు రవితేజ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం విక్రమార్కుడు. దొంగ అత్తిలి సత్తి బాబు, ఏఎస్పీ విక్రమ్ సింగ్ రాథోడ్ గా రెండు వేరియేషన్స్ ని చక్కగా పలికించారు. ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో రవితేజ నటన మాటల్లో వర్ణించలేము.

నేనింతేఅందరిని ఎంటర్ టైన్ చేసే సినిమావారి కష్టాలను నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ చక్కగా చూపించారు. రవితేజ కృష్ణానగర్ లో ఉండే వారి బాధలను కళ్ళకు కట్టారు.

కిక్ సరదా పాత్రలు చేయడం రవితేజకు అత్యంత సులువు. అటువంటి క్యారక్టర్ కి యాక్షన్ జోడిస్తే కిక్ వస్తుంది. కిక్ సినిమాలో కళ్యాణ్ గా పూర్తి జోష్ తో రవితేజ నటించి ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.

శంభో శివ శంభో నటన ప్రాధాన్యత ఉన్న రోల్ ని రవితేజ అసలు వదలరు. శంభో శివ శంభో లో కర్ణ పాత్రలో స్నేహితుడు ఎలా ఉంటారో అలా నటించి ఆకట్టుకున్నారు.

ఖడ్గం క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అందరితో ప్రశంసలు అందుకుంది. సినిమా ఛాన్స్ కోసం తిరివే యువకుడు కోటి పాత్రలో రవితేజ నటన అమోఘం. ఇందులో నటనకు రవితేజ తొలిసారి నంది అవార్డు అందుకున్నారు.

పవర్ ట్రాన్స్ఫార్మర్ కి ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుంది.. ? ఏసీపీ బల్దేవ్ సహాయ్ లాగా ఉంటుంది. పవర్ సినిమాలో రవితేజ పోషించిన ఈ పాత్ర అందరితో శెభాష్ అనిపించుకుంది.

రాజా ది గ్రేట్ “ఐ యామ్ బ్లైండ్.. బట్ ఐ యామ్ ట్రైన్డ్” అంటూ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అదరగొట్టారు. స్టార్ హీరోలు ఒప్పుకోవడానికి వెనుకడుగు వేసే అంధుడి పాత్రను తీసుకొని.. అలరించారు.

ఇవే కాకుండా సముద్రం .. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న తమిళ మ్మాయి.. బలుపు.. వంటి సినిమాల్లోనూ రవితేజ మంచి నటన కనబరిచారు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని పాత్రలతో మెప్పించాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus