Ravi Teja, Vishwan , Manoj: టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైందా?

  • July 4, 2023 / 10:01 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. మంచి కథలతో తెరకెక్కితే మల్టీస్టారర్ సినిమాలు సంచలనాలు సృష్టిస్తాయని ఇప్పటికే టాక్ ఉంది. అయితే రవితేజ విశ్వక్ సేన్ మనోజ్ కాంబోలో మల్టీస్టారర్ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతోంది. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది.

రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లు పూర్తైన తర్వాత మాత్రమే రవితేజ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఏ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

సినిమా సినిమాకు విశ్వక్ సేన్, మనోజ్ లకు క్రేజ్ పెరుగుతోంది. మంచు మనోజ్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. రవితేజ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో రావణాసుర మినహా (Ravi Teja) రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించాయి. రవితేజ టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు రవితేజ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రవితేజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus