జూన్ లో రవితేజ కొత్త సినిమా మొదలు..!!

నూతన దర్శకుడు చక్రి దర్శకత్వం మాస్ మహారాజ్ హీరోగా రాబిన్ హుడ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై ఎటువంటి సమాచారం లేదు. ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశి ఖన్నా జంటగా నటించనుంది. ఈ చిత్రాన్ని డి‌వి‌వి దానయ్య నిర్మించనుండగా.. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు. మరోవైపు ఈ చిత్రం కోసం రవి తేజ జిమ్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus