Maadhav Bhupathiraju: రవితేజ ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడట..!

మాస్ మహారాజా రవితేజ 20 ఏళ్ళుగా టాలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అతను స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన రవితేజ ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. తను ఎదగడమే కాకుండా ఎంతో మంది కొత్త డైరెక్టర్లను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత కూడా పొందాడు. రవితేజ తమ్ముళ్లు కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సందర్భాలు ఉన్నాయి.

‘రాజా ది గ్రేట్’ లో అతని కొడుకు మహదన్ కూడా నటించారు. ఇదిలా ఉండగా రవితేజ తమ్ముళ్లలో ఒకరైన రఘు అందరికీ సుపరిచితమే. అతని కొడుకు మాధవ్ భూపతిరాజు ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు.’లక్ష్మీ’ ‘లక్ష్యం’ ‘రేసు గుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణంలో మాధవ్ డెబ్యూ మూవీ రూపొందనుంది. ‘భవ్య సమర్పణలో’ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ బ్యూటిఫుల్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందనుంది.

ఈ చిత్రానికి ‘ఏయ్… పిల్లా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇది ‘అందరి హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమని… థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి ఇస్తుందని, 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని రూపొందిస్తున్నామని.. సెప్టెంబర్ నుండి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు ‘ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తెలిపారు.

‘ఏయ్… పిల్లా’ చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకు కూడా ఇది డెబ్యూ మూవీనే.! దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం.ఈ చిత్రం ద్వారా లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus