Chiranjeevi, Ravi Teja: చిరుతో కలిసి రవితేజ స్క్రీన్ మీద ఏంతసేపు కనిపిస్తాడంటే..?

  • October 20, 2022 / 06:48 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల బాండింగ్ వేరు. చిన్నప్పటినుండి బిగ్ బి అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ తను సినిమాల్లోకి రావడానికి కష్టపడి ‘స్వయంకృషి’తో సినిమా రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగిన చిరంజీవే కారణం అంటూ ఎన్నోసార్లు చెప్పాడు. ఒకరకంగా రవితేజ చిరు ఫ్యాన్ అనడం కంటే భక్తుడు అనడం బెటర్ ఏమో. అలాంటి తన అభిమాన నటుడితో కలిసి 2000 వ సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ‘అన్నయ్య’ మూవీలో చిరు తమ్ముడిగా యాక్ట్ చేశాడు.

దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ చిరుతో తెరపంచుకుంటున్న సంగతి తెలిసిందే. రవితేజ ‘పవర్’ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత చిరు పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ చెయ్యబోతున్నారని, తన స్టైల్ కామెడీతో అలరించనున్నారని, మళ్లీ పాత చిరంజీవిని చూడబోతున్నామని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా రవితేజ క్యారెక్టర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కథను మలుపుతిప్పే కీలకమైన పాత్రలో రవితేజ కనిపించనున్నాడట. అలాగే తన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లోనూ ఉంటుందట. సినిమా మొత్తం మీద 45 నిమిషాల పాటు రవితేజ తెరమీద సందడి చేస్తాడట. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 11న భారీ స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.

ఇక ‘క్రాక్’ తో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో వరుస ఫ్లాపులు అందుకున్నాడు. ప్రస్తుతం త్రినాధ రావు నక్కిన డైరెక్షన్లో ’ధమాకా‘, సుధీర్ వర్మతో ‘రావణాసుర’తో పాటు ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలు చేస్తున్నాడు..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus