Ravi Teja: చిరు సినిమాలో రవితేజ.. ఎంతసేపు కనిపిస్తారంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రవితేజ ఓ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన క్యారెక్టర్ ఎంతసేపు కనిపిస్తుంది..? ఫుల్ లెంగ్త్ రోలా..? లేక గెస్ట్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందా..? అనే సందేహాలు కలిగాయి. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. సినిమాలో రవితేజ 42 నుంచి 44 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనిపిస్తారు.

అది కూడా మేజర్ సీన్స్ అన్నీ మెగాస్టార్ కాంబినేషన్ లోనే ఉంటాయి. ఇద్దరి కాంబినేషన్ లో ‘పూనకాలు లోడింగ్’ అనే సాంగ్ కూడా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ కట్ వర్క్ జరిగిపోయింది. రెండు గంటల 35 నిమిషాల నిడివి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాల నిడివి రెండున్నర గంటలకు మించకుండా చూసుకుంటున్నారు. ఎక్కువ నిడివి ఉంటే జనాలు బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

అందుకే డ్యూరేషన్ ఎక్కువ లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ‘వాల్తేర్ వీరయ్య’ కూడా అటు ఇటుగా నిడివి అంతే వచ్చింది. ఈ సినిమాకి పోటీగా వస్తోన్న ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హీరో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా నిడివి ఎంత అనేది తెలియాల్సివుంది. కథ ప్రకారం.. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో నిడివి కాస్త ఎక్కువే వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. బాలయ్య, చిరంజీవి సినిమాలతో పాటు విజయ్ ‘వారసుడు’ సినిమా కూడా సంక్రాంతికి రానుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus