46 ఏళ్ల సినీ ప్రయాణంలో నటన, డ్యాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేసిన చిరంజీవి (Chiranjeevi) మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు ఇచ్చారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) చేతుల మీదుగా చిరు ఈ అవార్డు అందుకున్నారు.
అయితే ఈ ఈవెంట్‌కి వచ్చిన చిరంజీవిని చూస్తే అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో ఈవెంట్లకు కనిపించే చిరు కాస్త నెరిసిన గడ్డంతో ఉన్నాడు. ఏదో సినిమా కోసం అలా ఉన్నారేమో అని తొలుత అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మాట విషయంలోను, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ డిఫరెన్స్‌లు కనిపించాయి. ఏదో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల అలా ఉన్నారేమో అనుకున్నారు. కానీ ఆయన స్టేజీ ఎక్కినప్పుడు అసలు విషయం తెలిసింది.
చిరంజీవి స్టేజీ ఎక్కుతున్నప్పుడు ఓవైపు ఆమిర్ ఖాన్, మరోవైపు సాయి తేజ్ (Sai Dharam Tej) సాయంగా వచ్చి మెట్లు ఎక్కించారు. దీంతో చిరుకు ఏమైంది అనే ప్రశ్న మొదలైంది. అయితే ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ఆయన గత నెల రోజులుగా చికున్ గున్యాతో బాధపడుతున్నారట. అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈవెంట్‌కి హాజరయ్యారని తెలిసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చిరు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ మెగాస్టార్’ అని పోస్ట్స్ పెడుతున్నారు.
అయితే, ఈ సమయంలో మాట్లాడకూడదు కానీ.. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా విడుదల విషయంలో ఇదేమైనా ఇబ్బంది పెడుతుందా అనే డౌట్ మొదలైంది. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకురావాలని ప్లాన్ వేశారు. ఇప్పుడు ఇలా ఇన్ని రోజులు సినిమా ఆగితే ఆ రోజుకు రావడం కష్టం. మరి చిరంజవి ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.