Raviteja Gopichand malineni : నాలుగోసారి రిపీట్ కాబోతున్న రవితేజ గోపీచంద్ కాంబో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు పొందినటువంటి వారిలో మాస్ మహారాజ రవితేజ డైరెక్టర్ గోపీచంద్ మలినేని జంట కూడా ఒకటని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ మూడు సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క్రాక్.

ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఇలా మూడు సార్లు సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసినటువంటి వీరిద్దరు నాలుగో సారి కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక వీరి కాంబోలో సినిమా రాబోతుందని ఇదివరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలను హైదరాబాద్లో ఎంతో ఘనంగా ప్రారంభించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవితేజ గోపీచంద్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలో పాల్గొన్నారు.

ప్రముఖ డైరెక్టర్వినాయక్‌ రవితేజ, సెల్వ రాఘవన్‌, ఇందుజలపై క్లాప్‌ కొట్టారు. ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. నాలుగోసారి గోపీచంద్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus