Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Advertisement

రవితేజ నన్నిమల(Raviteja Nannimala) సోషల్ మీడియా ఫాలో అయ్యే జనాలకి ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ ఎడిటర్ గా కెరీర్ ను ప్రారంభించిన అతను తర్వాత నటుడుగా మారి పలు యూట్యూబ్ సిరీస్లో అత్యంత కీలక పాత్రలు పోషించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

Raviteja Nannimala

‘మహాతల్లి’ ‘సోటారి బ్రదర్స్’ వంటి సిరీస్..లు రవితేజకి లైఫ్ ఇచ్చాయి అని చెప్పాలి. వాటి వల్ల సినిమాల్లో కూడా ఇతనికి మంచి ఛాన్సులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, నాని ‘దసరా’, ‘మ్యాడ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రవితేజ… వీటితో పాటు ‘సెబాస్టియన్’ ‘చక్రవ్యూహం’ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఓ పక్క యూట్యూబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు రవితేజ. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మేమ్ కాప్ లం’ సిరీస్ మే 22 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఇందులో రవితేజ స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అయ్యాడు.

2025 తనకు అస్సలు కలిసిరాలేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.అటు తర్వాత “2025 నాకు అస్సలు బాలేదు.ఆ ఏడాది అంతా ఇండస్ట్రీ అనే సముద్రంలో నేను ఈదాను. అలాంటి టైంలో నన్ను బివిఎస్ రవి గారు ‘జీ5’ ద్వారా నాకు ‘మేమ్ కాప్ లం’ చేసే అవకాశం ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ.ఇక ‘మేమ్ కాప్ లం’ సిరీస్ లో నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. గెటప్ శీను అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనితో పాటు రవితేజ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags