RC16: స్టార్ క్యాస్ట్ తోనే స్టన్నింగ్ ప్లాన్!

  • December 1, 2024 / 09:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా  (Buchi Babu Sana)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RC16’ (RC16 Movie)  ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసింది. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తర్వాత చేయబోతున్న సినిమా ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. తెలుగులో ‘దేవర’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న జాన్వీ, ఇప్పుడు చరణ్‌తో కలిసి మరో మెగా ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది.

RC16

ఆమె పాత్ర చిత్ర కథనానికి కీలకమని, దాని ద్వారా ఆమెకు మరో హిట్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ఈ సినిమాకు మరింత బలాన్నిచ్చేలా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను (Shiva Rajkumar) కీలక పాత్రకు తీసుకోవడం జరిగింది. శాండిల్ వుడ్ స్టార్ అయిన శివరాజ్ ఈ చిత్రంలో విలక్షణ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. జగపతి బాబు (Jagapathi Babu) కూడా ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ ఇద్దరు సీనియర్ నటుల జోడీతో కథలోని ఎమోషనల్ డెప్త్ మరింత పెరగబోతోందట.

మరింత ఆసక్తికరంగా, ‘మీర్జాపూర్’ ఫేమ్ దేవేందు శర్మను కీలక పాత్రలో నటింపజేయడం కూడా దర్శకుడు బుచ్చిబాబు మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తోంది. హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న దేవేందు పాత్రకు ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఉందని చెప్పొచ్చు. దీనితో పాటు మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ సినిమాకు జతకావచ్చని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

చాలా ఏళ్ల తర్వాత తెలుగులో మళ్లీ ఆయన పని చేయడం విశేషం. రెహమాన్ సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయం. ఇలా స్టార్ క్యాస్ట్‌తో, గ్లోబల్ లెవెల్ టెక్నికల్ టీమ్‌తో ‘RC16’ ఓ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్‌గా మారుతోంది. బుచ్చిబాబు కథ, క్యాస్టింగ్, టెక్నీషియన్స్‌ ఎంపిక సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేస్తోంది. 2025 చివరికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోందని భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus