‘కార్తికేయ 2’ కి బడ్జెట్ ప్రాబ్లెమ్..!

యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి నిఖిల్ తో చేసిన ‘కార్తికేయ’ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తరువాత వీరిద్దరూ.. వారి వారి సినిమాలతో బిజీ అయిపోయారు. చందూ మొండేటి ‘ప్రేమమ్’ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తరువాత ‘సవ్యసాచి’ వంటి యాక్షన్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఇక ‘కార్తికేయ2’ సినిమా అటకెక్కిసినట్టే అంటూ ప్రచారం జరిగింది.

అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ అవ్వడంలేదు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానికి అసలు కారణం ఇదేనంటూ ఫిలింనగర్ విశ్లేషకుల నుండీ సమాచారం అందుతుంది. దీనికి అసలు కారణం బడ్జెట్ అట. కథ రీత్యా ఈ సీక్వెల్ విదేశాల్లో చిత్రీకరణ జరుపాల్సి ఉందట. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువే అని తెలుస్తుంది. దీనికి చాలా ఖర్చవుతుంది.. ఏకంగా 20 కోట్ల వరకూ ఆయన బడ్జెట్ అనుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ చందూ మొండేటి అలాగే హీరో నిఖిల్.. ఇద్దరికీ హిట్లు లేవు. అందుకే నిర్మాతలు వెనుకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయా బడ్జెట్ ను 15 కోట్లకి తగ్గించాడట దర్శకుడు చందూ. దీంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందని.. త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus