కథ నచ్చకపోతే వంశీ ప్రాజెక్ట్ లా రిజెక్ట్ చేస్తాడా?

  • April 21, 2020 / 05:51 PM IST

రాజమౌళితో మూవీ అనగానే మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాజమౌళి మూవీతో మహేష్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం ఖాయం అని ఊహల్లో తేలుతున్నారు. రాజమౌళికి ఉన్న రికార్డ్స్ దృష్ట్యా ఆ మూవీ ఏదైనా ఇండస్ట్రీ రికార్డ్స్ అందుకోవడం ఖాయం అని భావిస్తున్నారు. ఐతే రాజమౌళితో మహేష్ చేయనున్న మూవీ కథ ఏమై ఉంటుంది? జోనర్ ఏమిటీ? అనే ఆసక్తి కలడం సహజం. మరి ఇదే విషయంపై రాజమౌళిని అడిగితే ఏమన్నాడో తెలుసా? మహేష్ తో మూవీ చేసే ప్లాన్ ఉంది.

ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ తో నే సినిమా ఉంటుంది అన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అనుకున్నది కాదని,. ఏడెనిమిదేళ్ళ నుండి అనుకుంటున్న ప్రాజెక్టు, ఐతే మిగతా ప్రాజెక్ట్స్ తో బిజీ కావడం వలన కాంబినేషన్ సెట్ కాలేదు అని తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే అసలు మహేష్ మూవీకి ఇంకా కథే సెట్ కాలేదట. ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ మూవీ కోసం కథ ఎంపిక, దానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేయాలని అన్నారు.

కాకపోతే లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేకవడంతో రాజమౌళి ఖాళీగా ఇంట్లో ఉంటున్న తరుణంలో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథా చర్చలు మొదలుపెడదామా అని అన్నారట. ఐతే పూర్తి స్క్రిప్ట్ చెవితేనే వంశీ పైడిపల్లితో నచ్చలేదని ప్రాజెక్ట్ వదిలేసిన మహేష్, రాజమౌళి కథ, స్క్రిప్ట్ నచ్చకపోతే చేయనని చెవుతాడా? లేక రాజమౌళి కాబట్టి ఎలాంటి కథైనా ఒప్పుకొని సినిమా చేస్తారా? అనేది ఆసక్తికరం.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus