అభిమానులకి కిక్ ఇస్తున్న రవితేజ లుక్..!

గత సంవత్సరం ఏకంగా మూడు డిజాస్టర్లు అందుకున్నాడు మాస్ మహా రాజ్ రవితేజ. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఈ చిత్రాలు డిజాస్టర్లు కావడమే కాదు కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టకుండా రవితేజ మార్కెట్ ను దిగజార్చాయి. ఇక ఈ చిత్రాల్లో రవితేజ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు నిరాశచెందారు. ఫిట్ గా ఉన్నప్పటికీ మొహం మరీ చిక్కిపోయినట్టు ఉండడంతో ఫ్యాన్స్ సైతం నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా రవితేజ లుక్ ఒకటి బయటకి వచ్చింది.

జిమ్ లో తెగ కష్టపడుతున్నట్టు ఈ ఫొటోలో రవితేజ కనిపిస్తుండడం విశేషం. అయితే రవితేజ ఇలా వర్కౌట్ లు చేయడానికి కారణం తన తదుపరి సినిమా కోసమే అని సమాచారం. ప్రస్తుతం రవితేజ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వయసు మళ్ళిన వృద్ధిడి పాత్రలో ఒక పాత్ర అలాగే కండలు తిరిగిన యువకుడిగా మరో పాత్రల్లో రవితేజ కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రంతో కచ్చితంగా హిట్టందుకోవాలని రవితేజ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. చాలా న్యాచురల్ గా ఉన్న ఈ లుక్ రవితేజ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తుందనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus