ఆ సినిమాల విషయంలో నాగార్జున ఎందుకు సైడైపోయారు!

పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు, మెగా పవర్ స్టార్లు, యంగ్ టైగర్లు ఇతరాత్రా స్టార్లు ఎంతమంది ఉన్నా.. ఇప్పటికీ తెలుగు చిత్రసీమకు సంబంధించి అగ్ర కథానాయకులు మాత్రం నాలుగురే.. వారే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. మాస్ తోపాటు క్లాస్ లోనూ విశేషమైన క్రేజ్ ఉన్న కథానాయకుడు చిరంజీవి కాగా.. మాస్ ఆడియన్స్ ను ఓన్ చేసుకొన్న హీరో బాలకృష్ణ. ఇక వెంకటేష్ ఫ్యామిలీ హీరో అయిపోగా.. ఒక్క నాగార్జున మాత్రమే అన్నీ రకాల సినిమాలు చేస్తూ.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ.. ఒక హీరోగానే కాక నిర్మాతగానూ ఎదిగాడు. అందుకే నాగార్జునను పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు.

అయితే.. ఈమధ్య నాగార్జున బిజినెస్ క్యాల్కులేషన్స్ ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకంటే కేవలం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో రూపొందిన చిత్రాలకే విపరీతమైన పబ్లిసిటీ చేసే నాగార్జున ఈమధ్య తాను స్వయంగా నిర్మించిన చిత్రాల విషయంలో సైలెంట్ అయిపోతున్నాడు. ఈ వ్యవహారం “ఊపిరి” సినిమా నుంచి మొదలైంది. 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అయినప్పటికీ.. కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. దాంతో నాగార్జున ఆ సినిమా విషయంలో మరింకేం మాట్లాడలేదు. అలాగే.. తాను నిర్మించిన “హలో” సినిమా గురించి కూడా రిలీజ్ కి ముందు విపరీతమైన ప్రచారం చేసిన నాగార్జున.. రిలీజ్ తర్వాత ఓవర్సీస్ లో మిలియన్ డాలర్స్ వసూలు చేయడం మరో ట్వీట్ చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు “రంగుల రాట్నం” పరిస్థితి కూడా ఇంతే. రిలీజ్ కి సరిగ్గా మూడు రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ కి అటెండ్ అయిన నాగార్జున తర్వాత ఆ సినిమా గురించి మరో మాట మాట్లాడలేదు. సినిమాల రిజల్ట్స్ అప్పటికే తెలిసిపోవడం వల్ల మాట్లాడడం లేదా ఇంట్రెస్ట్ ఉండడం లేదా అనే విషయం పక్కన పెడితే.. నాగార్జున కొత్త అలవాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇదే పరిస్థితి గనుక కంటిన్యూ అయితే.. ఇకపై నాగార్జున మాట్లాడని సినిమాలన్నీ ఫ్లాప్ అని జనాలు డిసైడ్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus