NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

‘బ్రదర్.. వెళ్ళిపోనా..? వెళ్ళిపోనా…?  నేనేమన్నాను.. నేను మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండండి.. నాకు ఒక్క సెకండ్ పట్టదు మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే..! మాట్లాడనా.. తట్టుకోండి కాసేపు’ అంటూ అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు ఎన్టీఆర్. నిన్న జరిగిన ‘వార్ 2’ ప్రీ రిలీజ్ వేడుకలో స్పీచ్ ఇస్తూ.. ఎన్టీఆర్ అభిమానుల పై మండిపడ్డారు. దీనికి కారణం ఏంటి? అంటే.. 2 రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి.

NTR

ఒకటి.. 2013 వచ్చిన ‘బాద్ షా’ ప్రీ రిలీజ్ వేడుకలో.. వరంగల్ కి చెందిన ఎన్టీఆర్ అభిమాని మృతి చెందాడు.అప్పటి నుండి ఎన్టీఆర్ పబ్లిక్ ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నట్లు.. నిన్న ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్న టైంలో, అంతకు ముందు స్టేజి పైకి వెళ్లిన టైంలో కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ వద్దకు దూసుకెళ్లారు. దీంతో ఎన్టీఆర్ మూడ్ మారిపోయింది.. అందుకే అలా అభిమానుల పై  కోపం ప్రదర్శించినట్లు ఒక సమాధానం వినిపిస్తోంది.

మరొకటి ఏంటంటే.. ప్రీ రిలీజ్ వేడుక ఆరంభంలో కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ ను ‘సీఎం సీఎం’ అంటూ అరిచారు. పక్కన ఉన్న యాంకర్ కూడా ఎన్టీఆర్ ని ‘సీఎం సీఎం’ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. పూర్తిగా ఇది ఔట్ ఆఫ్ బాక్స్ టాపిక్. సాధారణంగా ఇలాంటి వాటికి యాంకర్ లు రియాక్ట్ అవ్వరు. కానీ సదరు యాంకర్.. ఎన్టీఆర్ ను సీఎం అనడంపై నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క ఎన్టీఆర్ రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘ఆ టాపిక్ ను స్కిప్ చేస్తూ సైడ్ అయిపోతున్నాడు’. అయినా ఎన్టీఆర్ ని రాజకీయ ‘రొచ్చులోకి లాగుతూ ఉన్నారు చాలా మంది అభిమానులు’ అనే అభిప్రాయాలు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్న టైంలో కూడా ‘సీఎం సీఎం’ అని కొందరు అరవడంతో ఎన్టీఆర్ బాగా డిస్టర్బ్ అయ్యి వారిపై ఆగ్రహం చూపించినట్టు మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ అయితే హర్ట్ అయ్యాడు. అదైతే నిజమే..!

రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus