మొన్నామధ్య “భరత్ అనే నేను” రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు “ప్రయోగాలు చేసి విసిగిపోయాను, ఇకపై కమర్షియల్ సినిమాలు చేయను” అంటూ ఇచ్చిన స్టేట్ మెంట్ అందరికీ గుర్తుంది. అయితే.. మరో వైవిధ్యమైన చిత్రమైన “భరత్ అనే నేను”తోనే మహేష్ మంచి హిట్ అందుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ డైలాగ్ ను రిపీట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. తాను కొత్తగా, దిఫరెంట్ కాన్సెప్ట్ తో ట్రై చేసిన “నా పేరు సూర్య”ను ప్రేక్షకులు ఆదరించలేదు కాబట్టి ఇకపై కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను అంటున్నాడు బన్నీ.
నిజానికి “నా పేరు సూర్య” అనేది ఒక్క క్లైమాక్స్ తప్ప ఎక్కడా ప్రయోగాత్మక చిత్రం అనిపించదు. అలాంటప్పుడు దాన్ని కమర్షియల్ సినిమా అని ఎలా అనుకొంటారు. ఇక మహేష్ తో కంపేర్ చేస్తే బన్నీ చేసిన ఎక్స్ పెరిమెంట్స్ చాలా తక్కువ. కేవలం ఒక్క ప్రయోగం అని చెప్పుకొనే ప్రయోగం విఫలమైందంటూ.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి విక్రమ్ కుమార్ చెప్పిన కథను కాదనడం ఎంతరవ్రకూ సమంజసం అనేది బన్నీ బాబుకే తెలియాలి. “నా పేరు సూర్య” అనంతరం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండబోతోందని టాక్ వినిపించినప్పటికీ.. “నా పేరు సూర్య” రిజల్ట్ తో బన్నీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.