కాజల్ ఆ సినిమా వదులుకోవడానికి కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో క్లాసీ హిట్స్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న యువహీరో శర్వానంద్. అతను నటించిన శతమానంభవతి, మహానుభావుడు చిత్రాలు విజయాన్ని సాధించాయి. శర్వానంద్ ప్రస్తుతం యువ డైరక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నారు. స్వామిరారా, కేశవా చిత్రాలతో మంచి పేరుతెచ్చుకున్న ఈ డైర్టెర్ సినిమా అనగానే అంచనాలు ఎక్కువగా ఉంది. సక్సస్ బాటలో నడుస్తున్న వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీలో ఛాన్స్ అనగానే ఎవరైనా ఓకే చెబుతారు. కానీ టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ వదులుకుంది. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. శర్వానంద్ ఈ సినిమాలో ద్వి పాత్రాభినయం చేయనున్నారు.

ఇందులో ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. 40 ఏళ్ళ శర్వానంద్ పాత్ర కోసం కాజల్‌ని సంప్రదించారని, ఆ రోల్ చేస్తే తన కెరీర్ ఇబ్బందిలో పడుతుందని భావించి తిరస్కరించినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న సమయంలో ఏజ్డ్ హీరోయిన్ గా నటించడమంటే సాహసంతో కూడిన పనే..  ఈ ఛాన్స్ ని వదులుకొని కాజల్ మంచి నిర్ణయం తీసుకుందని ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus