అందుకే చరణ్ తో కొరటాల సినిమా క్యాన్సిల్ అవుతూ వస్తుందట..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో.. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. సూపర్ హిట్ డైరెక్టర్ .. స్టార్ హీరో కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో కాలం ఎదురుచూస్తూనే ఉంటారు అభిమానులు. ఉదాహరణ కి పవన్ కళ్యాణ్ , సుకుమార్ కాంబినేషన్లో సినిమా కోసం.. అలాగే మహేష్ , రాజమౌళి కాంబినేషన్ కోసం .. ప్రభాస్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఈ స్టార్ హీరోల అభిమానులు చాలా కాలం నుండీ ఎదురుచూస్తున్నారు. ఇవి జస్ట్ అనుకుంటున్న కాంబినేషన్. అయితే మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కొరటాల శివ, రాంచరణ్. ఈ కాంబినేషన్లో ఇప్పటికే ఓ సినిమా రూపొందాల్సి ఉంది. ఇప్పటికే 3 సార్లు పూజా కార్యక్రమాలు జరిగి కూడా ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.

అసలు ఈ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వట్లేదు అని కొరటాల నే అడిగితే.. ‘చరణ్ గారితో అనుకున్న స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేస్తే బెటర్ అని ముందు నుండీ అనుకుంటూ ఉంటాను. ఎన్ని సార్లు మార్చినా.. ఆ స్క్రిప్ట్ మాత్రం అంత సంతృప్తి ఇవ్వడంలో లేదు. ఇదే మాట చరణ్ గారికి చెప్తే.. ‘మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ పై పూర్తి నమ్మకంతో ఉంటారో అప్పుడే చేద్దాం’ అని స్నేహ పూర్వకంగానే చెప్తూ ఉంటారు. ఆయనతో సినిమా అంటూ తీస్తే పెద్ద హిట్టే కొట్టాలి..! అలాంటి సినిమానే తీస్తాం’ అంటూ ఎప్పుడూ చెప్పే సమాధానమే కొరటాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి చెప్పుకొచ్చాడు.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus