పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆయనపై కొందరు ప్రత్యర్థులు విమర్శలతో దాడి చేస్తున్నారు. జీవితం ప్రజా సేవకే అంకితం ఇక పై సినిమాలు చేసేది లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ మరలా ముఖానికి రంగు వేసుకున్నాడు, నిలకడ లేని స్వభావం అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక జనసేన కీలక నేతలతో ఒకరైన జె డి లక్ష్మీ నారాయణ ఇదే కారణంగా జనసేనకు రాజీనామా చేయడం జరిగింది. ఎందరు ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ వాటికి మీడియా వేదికగా సమాధానం చెవుతున్నారు. గతంలో మాట్లాడుతూ…మిగతా రాజకీయ నాయకుల వలే నాకు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు లేవు, తెలిసింది సినిమానే.. ఖర్చులు, అవసరాల కోసం సినిమా చేస్తున్నాను అన్నారు.
ఇక తాజాగా పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు, ఫీజులు చెల్లించడానికి సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఐతే పవన్ లాజిక్ ప్రకారం ఒక వేళ ఆయన ఎం ఎల్ ఏ గా గెలిచి ఉంటే ఖచ్చితంగా సినిమాలు చేసే వారు కాదు. పవన్ ఎం ఎల్ ఏ అయ్యివుంటే ఆయనకు ఎటూ ఎం ఎల్ ఏ గా కొంత జీతం అందుకోనేవారు, ఆ జీవితం డబ్బులతో ఆయన చెప్పిన పిల్లల ఫీజులు భర్తీ చేసుకొని ఫుల్ టైం పాలిటిక్స్ లో కొనసాగేవారు. ఆయన ఓటమి కూడా సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం అని ఆయన చెప్పకనే చెవుతున్నాడు. ఇక ఆయన ఏక కాలంలో పింక్ రీమేక్ తో పాటు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ చిత్ర షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!