Prabhas: ప్రభాస్ నిర్మాత ఊహించని కామెంట్లు.. అందుకే సినిమాలకు దూరం అంటూ..!

సినీ పరిశ్రమలో నిర్మాతగా నిలబడటం అంటే మాటలు కాదు. లాభాలు వస్తాయని గ్యారెంటీ చెప్పలేని సినీ పరిశ్రమ ఇది. ఇక్కడ సక్సెస్ రేట్ కూడా 4 శాతమే. అయితే వివిధ రంగాల్లో సంపాదించుకున్న తర్వాత సినిమాలు చేయాలనే ఇష్టంతో ఇక్కడికి అడుగుపెట్టి.. 4 ప్లాపులు తగలగానే వెనుదిరిగిన వాళ్ళను చాలా మందిని చూశాం. అలాంటి వాళ్లలో ఆదిత్య రామ్ (Aditya Ram) ఒకరు. గతంలో ఈయన జగపతి బాబుతో (Jagapathi Babu) ‘సందడే సందడి’ ‘ఖుషి ఖుషీగా’ ‘స్వాగతం’ (Swagatam) వంటి చిన్న సినిమాలు నిర్మించారు.

Prabhas

అవి పర్వాలేదు అన్నట్టు ఆడాయి. దీంతో ప్రభాస్ (Prabhas) , మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో పెద్ద సినిమాలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ముందుగా ప్రభాస్ తో చేసిన ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) ప్లాప్ అవ్వడంతో, ఆయన సినిమాలు చేయలేదు. ఇందుకు గల కారణాలు తాజాగా ఆయన వివరించారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఈయన కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈరోజు చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు.

ఆదిత్య రామ్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య రామ్ మూవీస్’ బ్యానర్ పై 4 సినిమాలు నిర్మించాను. ప్రభాస్ తో చేసిన ‘ఏక్ నిరంజన్’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ఎందుకంటే సినిమాల్లో కంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ గ్రోత్, పొటెన్షియల్ ఉందని నేను గుర్తించాను. ఇక్కడ ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో అక్కడ ఉండిపోయాను.

అందుకే సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. దశాబ్ద కాలం తర్వాత ‘గేమ్ ఛేంజర్’  (Game Changer)  సినిమాకి నేను సహా నిర్మాతగా వ్యవహరించాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి నా బ్యానర్ పై తమిళంలో సినిమాలు చేయాలని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డి వంగా చెంపదెబ్బల కాంట్రోవర్సీ పై చిన్మయి వివరణ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus