సినిమా పరిశ్రమలో ప్రతి విషయంలో దర్శక నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్ ఇలా ప్రతి ఒక్కరు సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. సినిమా టైటిల్స్ దగ్గర నుండి రిలీజ్ డేట్స్ వరకు చాలా విషయాలలో సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అలాగే సెంటిమెంట్స్ కూడా చాలా మందిని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సెంటిమెంటే దర్శకుడు వంశీ పైడిపల్లిని కూడా వెంటాడుతుంది. వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి పుష్కరం దాటిపోయింది. ఇన్నేళ్ళలో ఆయన చేసింది కేవలం 5 సినిమాలు మాత్రమే. సినిమాకు మరో సినిమాకు మధ్య రెండేళ్ల నుండి నాలుగేళ్లు గ్యాప్ రావడం ఆయన్ని వేటాడుతున్న సెంటిమెంట్.
ఆయన మెదటి చిత్రం ప్రభాస్ హీరోగా 2007లో వచ్చిన మున్నా. మున్నా మూవీ పెద్ద హిట్ సాధించకపోయినా దర్శకుడిగా వంశీకి ఓ గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం తరువాత మూడేళ్లకు 2010లో ఎన్టీఆర్ హీరోగా బృందావనం చేశారు. ఆ చిత్రం వంశీకి మంచి హిట్ అందించింది. హిట్ తరువాత కూడా వంశీకి మరో సినిమా చేసే అవకాశం 2014లో వచ్చింది. 2014 లో చరణ్ హీరోగా ఎవడు మూవీ చేశారు. అల్లు అర్జున్ ఓ కీలకపాత్ర చేసిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఎవడు వచ్చిన రెండేళ్లకు 2016 లో ఊపిరి…మరో మూడేళ్లకు 2019లో మహర్షి సినిమా చేశారు. మహేష్ హీరోగా వచ్చిన మహర్షి సూపర్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్లకు వంశీ తన గత చిత్రం విడుదలైన ఏడాదిలోపు మూవీ మొదలుపెడదాం అనుకుంటే సెంటిమెంట్ వెంటాడి మహేష్ చేత నో చెప్పించింది. దీనితో వంశీ మళ్ళీ మరో రెండు మూడేళ్లు ఆగాల్సివస్తుందేమో..పాపం వంశీ.. !
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!