‘జబర్దస్త్’ షో లో అందుకే చేయట్లేదు : వినోద్

బుల్లితెర పై రికార్డులు సృష్టిస్తున్న షో ఏదైనా ఉందా అంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది ‘జబర్దస్త్’ కామెడీ షో గురించే..! ఈ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక ఇదే షో లేడీ గెటప్ తో పాపులర్ అయిన వినోద్ (వినోదిని) కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. ఇటీవల ‘తన ఆస్తి విషయంలో దాడికి గురయ్యి కోలుకున్న’ వినోద్ ‘జబర్దస్త్’ స్టేజ్ పై కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల్లో ‘వై.సి.పి’ పార్టీ తరఫున ప్రచారం చేసిన కారణంగానే వినోద్ ను పక్కన పెట్టేశారనే వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా వినోద్ చెప్పుకొచ్చాడు. “జగన్ తరఫున ప్రచారం చేసినందుకు కాదు, ఆ సమయంలో షూటింగుకి సరిగ్గా డేట్స్ నేను ఇవ్వలేకపోయాను. అందుకే నన్ను పక్కన పెట్టారు. ఇందులో నిర్వాహకుల తప్పేమీ లేదు. నేను సరిగా రెస్పాండ్ కాకపోవడం.. నాకోసం వారు రాసుకున్న స్క్రిప్ట్ లలో మార్పులు చేయడం జరిగింది. దీంతో వారు నా పై కోపంగా ఉన్నారు. వారు అలా చేయడంలో తప్పేమీ లేదు. అందులోనూ నేను ఓ గొడవలో గాయపడటం .. కొంతకాలం పాటు రెస్టు తీసుకోవలసి రావడం వలన నటించడం కుదరలేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది.. త్వరలోనే ‘జబర్దస్త్’ వేదికపై కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus