తారక్ మళ్లీ బరువు పెరగడంపై భిన్న కథనాలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ మొదల్లోనే యాక్షన్ హీరో గా పేరు తెచ్చుకున్నారు. నూనూగు మీసాలప్పుడే తొడగొట్టి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టారు. అందుకు తగ్గట్టుగానే బాడీని మెయింటైన్ చేసుకున్నారు. అయితే నరసింహుడు, రాఖీ చిత్రాల సమయంలో బాడీ కంట్రోల్ తప్పింది. మరీ లావు అయిపోయారు. యమదొంగ కోసం ఎస్.ఎస్. రాజమౌళి తారక్ ని స్లిమ్ గా చెక్కాడు. కంత్రిలో అయితో మరీ సన్నగా అయిపోయారు. అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా బరువుని కంట్రోల్ చేసేవారు.

టెంపర్ నుంచి కథల్లోనే కాకుండా మేకోవర్ పై దృష్టిపెట్టారు. పాత్రకు అనుగుణంగా శరీరాన్ని మలుచుకోవడం, స్టైల్ ని అప్లై చేసుకున్నారు. ఇంకేముంది సక్సస్ తన దగ్గరకు వచ్చింది. వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ హిట్లు అందుకున్నారు. తర్వాత ఏమిటి? సస్పెన్స్. తారక్ కొత్త చిత్రం గురించి ఒక్క విషయం కూడా బయటికి రావడంలేదు. తాజాగా అయన తన అన్నయ్య కళ్యాణ్ రామ్ చిత్రం ఇజం ఆడియో వేడుకకు హాజరయ్యారు. మీసం, గడ్డం పెంచి, లావు పెరిగున్నారు. దీంతో తారక్ మళ్లీ బరువు పెరగడంపై సినీ వర్గాల్లో ఓ అంచనాకు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకోసమే బరువు పెరుగుతున్నారని నిర్ణయించాయి.

పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో తారక్ బాక్సర్ గా కనిపించనున్నారని అందుకు తగినట్లుగా లావు అవుతున్నారని భావిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత కల్యాణ్‌రామ్ ‘బాక్సర్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఉన్నారు. సో.. ఎవరూ అధికారికంగా ప్రకటించక పోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిల్మ్ “బాక్సర్” అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus