Bigg Boss 7 Telugu: తెర వెనుక ఏం జరుగుతోంది..? బిగ్ బాస్ సీజన్ 7 లో అసలు నిజాలు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇప్పటివరకూ పర్వాలేదనే అనిపించింది. మొదటి రెండు వారాలు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై సింపతీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇదే సింపతీతో అతను హౌస్ లో రెండు వారాలు సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత టాస్క్ లో బాగా ఆడి అందరి అంచనాలు తారుమారు చేశాడు. ఒకవైపు సీరియల్ ఆర్టిస్ట్ బ్యాచ్ తనని టార్గెట్ చేసినా, కొంతమంది బిగ్ బాస్ ఆడియన్స్ ప్రసాంత్ యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పినా తన గేమ్ తోనే అందరికీ సమాధానం చెప్పి కెప్టెన్ అయ్యాడు.

అయితే, పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బిగ్ బాస్ హౌస్ లో చాలామంది నచ్చడం లేదు. అంతేకాదు, కొంతమంది తను చెప్పినట్లుగా వినడం లేదని, వీడు చేప్పేదేంటి నేను వినేదేంటి అన్నట్లుగా ఉన్నారని ప్రశాంత్ బిగ్ బాస్ తో చెప్పుకున్నాడు. అలాగే, మిగతా హౌస్ మేట్స్ కూడా అసలు కెప్టెన్ అంటే ఎలా ఉండాలో క్లియర్ గా బిగ్ బాస్ కి చెప్పారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గానే అయ్యిందా? కావాలనే పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ బాస్ లాగేసుకున్నాడా ? మిగతా హౌస్ మేట్స్ అందరూ కలిసి పీకేశారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అసలు తెర వెనుక ఏం జరుగుతోందంటే.., లైవ్ లో చూసిన ప్రేక్షకులకి గత రెండురోజులుగా పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ టార్గెట్ అయ్యిందని అర్దమయిపోయింది. ఎందుకంటే, కంటెంట్ మొత్తం కెప్టెన్సీ పైనే చూపించాడు బిగ్ బాస్. కొత్త పార్టిసిపెంట్స్ రావడం, సీక్రెట్ రూమ్ నుంచీ గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చి కెప్టెన్ కి పవర్ లేకుండా చేయడం, కిచెన్ లో గొడవలు ఇవన్నీ చూపించాడు. అంతేకాదు, ప్రశాంత్ గేమ్ ని ఎక్కడా కూడా ఎలివేషన్ చేసేలా ఎపిసోడ్ లేదు. కేవలం కెప్టెన్సీ పై హౌస్ మేట్స్ విమర్శలు, కిచెన్ లో రేషన్ సరిపోకపోవడం పైనే ఫోకస్ పెట్టారు.

దీంతో వ్యూవర్స్ అందరికీ పల్లవి ప్రశాంత్ అసలు కెప్టెన్సీ బాగా చేయట్లేదని చిత్రీకరించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కామన్ గా జరిగే వంటింటి గొడవ తీవ్రస్థాయికి వెళ్లింది. భోళే షావాలి ఇంకా ప్రియాంక మద్యలో అస్సలు పడలేదు. ప్రియాంక కంప్లైట్స్ ఇస్తూ వచ్చిందిి. దీనికి తోడు మార్నింగ్ ఎపిసోడ్ లో గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చి ఇంట్లో ముగ్గురు కుక్స్ ని ఎంచుకోమని చెప్పాడు. అలాగే, క్లీనింగ్ డిపార్ట్ మెంట్ ని కూడా గౌతమ్ నే ఎంచుకోమని క్లియర్ గా చెప్పాడు.

దీంతో బిగ్ బాస్ కెప్టెన్సీకి పవర్ లేకుండా చేశాడు. ఆ తర్వాత అందర్నీ కూర్చోబెట్టి హౌస్ మేట్స్ అందరూ కెప్టెన్సీ బాగానే ఉందని చేతులు ఎత్తినా సరే, బిగ్ బాస్ ఇంటిని చూసుకోవడంలో రైతుబిడ్డ విఫలం అయ్యాడని చెప్పి కెప్టెన్సీని రద్దు చేశాడు. మిగతా హౌస్ మేట్స్ ఆనందంగా ఉన్నా, శివాజీ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికోసం పల్లవి ప్రశాంత్ బాగా కష్టపడ్డాడని బాధపడ్డాడు. మొత్తానికి కెప్టెన్సీ పీకేవరకూ కూడా (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ కళ్లు చల్లబడలేదని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus