Nayanatara,Trisha: స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేయడానికి కారణాలివేనా.. ఏం జరిగిందంటే?

పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే సామెతను మనలో చాలామంది వినే ఉంటారు. ప్రస్తుతం త్రిష అనుభవిస్తున్న పరిస్థితిని చూస్తుంటే ఆ సామెత నిజమేనని తెలుస్తోంది. ఏ తప్పు చేయకపోయినా కొంతమంది కావాలని త్రిషను టార్గెట్ చేస్తుండటం అభిమానులను హర్ట్ చేస్తోంది. ఈ విధంగా హీరోయిన్లను కించపరిచేలా టార్గెట్ చేసి కామెంట్లు చేయడం ఇదే తొలిసారి కాదు. టాప్ హీరోయిన్లను ఈ విధంగా టార్గెట్ చేయడం ఎక్కువగా జరుగుతోంది.

అప్పట్లో నయనతార క్యారెక్టర్ ను కించపరిచేలా కొంతమంది ఈ తరహా కామెంట్లు చేయగా ఆ సమయంలో నయనతార టాప్ రేంజ్ లో ఉన్నారు. ప్రస్తుతం త్రిష సైతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. పొన్నియిన్ సెల్వ సిరీస్, లియో సినిమాలతో విజయాలను అందుకున్న త్రిష విశ్వంభర సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఈ సినిమా సక్సెస్ అందుకుంటానని త్రిష నమ్మకంతో ఉన్నారు.

అయితే త్రిష (Trisha) కెరీర్ పరంగా ఎదగడం ఓర్వలేక కొంతమంది ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కావాలని టార్గెట్ చేసి ప్రణాళికాబద్ధంగా ఆమెపై ఆరోపణలు చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రిష న్యాయపరంగా పోరాటానికి సిద్ధమైన నేపథ్యంలో ఆమెకు న్యాయం జరగాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. త్రిషను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నాలుగు పదుల వయస్సులో కూడా త్రిష ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను అందుకుంటూ ఆందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

త్రిష నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని పాన్ ఇండియా రేంజ్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రిషకు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉండగా పెళ్లి విషయంలో త్రిష ఆసక్తి చూపడం లేదు. త్రిష పెళ్లికి సంబంధించిన తీపికబురు చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రిషకు ఇండస్ట్రీ నుంచి మరింత సపోర్ట్ లభిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus