ఏడాది కాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత కలిసి నటించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో ఆకర్షించే అంశాలు ఏమేమి ఉన్నాయంటే ? ..
స్టోరీదాదాపు పాతికేళ్ల క్రితం ఒక గ్రామంలో జరిగిన కథ. అమాయకమైన ప్రజలు.. ఏళ్ళ తరబడి పాలిస్తున్న సర్పంచ్.. అతని ఎదురుగా ఎన్నికల్లో నిలిచిన యువకుడు.. అతనికి అండగా నిలిచిన తమ్ముడు. పొలిటికల్ నేపథ్యంలో సాగే కథలో ఓ అందమైన ప్రేమ కథ. రెండింటిని సమానంగా మిళితం చేసి ఆ కాలానికి నేటి వారిని తీసుకుపోనున్నారు.
రామ్ చరణ్కెరీర్ మొదట నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ పోషించని పాత్ర చిట్టిబాబు. గడ్డం పెంచి.. లుంగీ కట్టుకొని గోదావరి యాసలో మాట్లాడుతూ మెప్పించబోతున్నారు. స్టార్ హీరో చెవిటి వాడిగా చెయ్యడం మరో ప్రత్యేకత.
సమంతగ్లామర్ క్వీన్ సమంత రంగస్థలంలో విలేజీ క్వీన్ గా కనిపించబోతోంది. రామ లక్ష్మి పాత్రలో అచ్చమైన పల్లెటూరి పిల్లగా నటించింది. ఆమె నటనకు ఫిదా అయిన చిత్ర బృందం స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఆమె నటన, నడక.. అబ్బబ్బ వెండితెరపైనే చూస్తేనే మజా.
రామ్ చరణ్ & సమంతసమంత టాలీవుడ్ లో అనేకమంది స్టార్ హీరోలతో నటించి హిట్ అందుకుంది. ఇందులో తొలిసారి చెర్రీ సరసన ఆడి పాడింది. ట్రైలర్, సాంగ్ ప్రోమోలలో ఈ జంటని చూస్తుంటే హిట్ పెయిర్ గానే కాకుండా బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకునేలా ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ కానుంది.
సుకుమార్తెలుగు చిత్ర పరిశ్రమలో అడ్వాన్స్ స్క్రిప్ట్ రాయడంలో సుకుమార్ దిట్ట. ఆయన స్క్రీన్ ప్లే అర్ధం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టంగా ఉండేది. ఏ సారి టెక్నీక్స్ ని పక్కన పెట్టి ఫీల్ మై స్టోరీ అంటూ రంగస్థలాన్ని తెరకెక్కించారు. ఈ సారి మాస్ మసాలాని గట్టిగా దట్టించారు.
కీలక రోల్స్ఇందులో హీరో, హీరోయిన్స్ రోల్స్ మాత్రమే కాకుండా కథలో మరో మూడు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వాటిని అనసూయ, అది పినిశెట్టి, జగపతి బాబు పోషించారు. విలన్ గా జగ్గుభాయ్ ఇందులోనూ నటవిశ్వరూపం చూపించబోతున్నారు. ఆది అయితే కన్నీరు తెప్పించాడని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పారు. ఇక అనసూయ రంగమ్మత్తగా కవ్వించనుంది.
దేవి శ్రీ ప్రసాద్సుకుమార్ చిత్రాలకు, మెగా ఫ్యామిలీకి అంటే దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో పాటలు కంపోజ్ చేస్తుంటారు. ఇక వారిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలానికి మంచి ట్యూన్స్ ఇచ్చారు. డప్పుల దరువులతో రంగా రంగా రంగస్థలాన .. జానపద గీతంలా రంగమ్మా మంగమ్మా.. ఆ గట్టునుంటావా నాగన్న పాటలను కంపోజ్ చేసి అల్లాడించారు. ఎంత సక్కగున్నావే … జిగేల్ రాణి పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. మరో పాట మిగిలి ఉంది. అంతేకాదు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టారని సమాచారం.
వీటితో పాటు పూజా హెగ్డే ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించనుంది. ఈ అంశాలు రంగస్థలాన్ని చూడాలనే ఆత్రుతని పెంచుతున్నాయి.