ది బెస్ట్ హోస్ట్ ఎన్టీఆర్ ఎలా అంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అతి పెద్ద రికార్డ్ ని నెలకొల్పింది. గత నెల 16 న ప్రసారమైన ఆరంభపు ఎపిసోడ్ తెలుగు టీవీ షో చరిత్రలో ఇది వరకు లేనంతగా 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) ను సాధించింది. డే వన్ నుంచి ఇప్పటి (డే 40 ) వరకు రోజు రోజుకి షో ఆదరణ పెంచుకుంటోంది. పైగా ఎన్టీఆర్ కనిపించే శనివారం, ఆదివారాల్లో ఈ షో రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. సూపర్ హోస్ట్ గా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు. అలా ఎందుకు అన్నామంటే.. చదివి తెలుసుకోండి.

స్టైల్ బుల్లి తెరే కదా అని ఎన్టీఆర్ లైట్ తీసుకోలేదు. ఒక ప్రత్యేకమైన స్టైల్ తో టీవీలో ప్రవేశించారు. సూట్ లో ఆకర్షించారు.

స్పాంటేనిటీ షో హోస్టింగ్ చేసే వారికీ స్పాంటేనిటీ చాలా అవసరం. స్టార్ హీరో అయిన తారక్ లో సమయ స్ఫూర్తి ఉంటుందా ? అని సందేహించారు. కానీ హీరోల్లో స్పాంటేనిటీ ఉంటే ఎలా ఉంటుందో చూపించారు.

ఆటపట్టించడం మూడీగా ఉన్నవారిని ఉత్సాహంగా చేయాలంటే ఆటపట్టించడం ఒక్కటే మార్గం. అది శృతి మించకుండా ఉంటే చూసేవారికి కూడా బాగుంటుంది. ఆ అనుభూతిని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

సహజత్వం కెమెరా ముందుకు వెళ్ళగానే హోస్ట్ కి ఉండే లక్షణాలు ఇవి అంటూ .. నేర్చుకున్న పాఠాన్ని అప్పచెప్పినట్లుగా చేసే హోస్టింగ్ కి ఎన్టీఆర్ బై బై చెప్పారు. ఇంట్లో ఎలా మాట్లాడుతారో.. అంతే సహజంగా మాట్లాడుతూ తారక్ మార్కులు కొట్టేస్తున్నారు.

డిక్షన్ ఎన్టీఆర్ కి తెలుగుపై మంచి పట్టుంది. సినిమాల్లో అయితే కొంతమేరె డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆకలి మీద ఉన్న పులికి ఆహారం దొరికినట్లుగా ఈ షోలో ఎన్టీఆర్ తెలుగు భాషతో మెస్మరైజ్ చేస్తున్నారు.

ఎనర్జీ మనం ఉత్సాహంగా ఉంటేనే చుట్టూ ఉన్నవారు ఉత్సాహంగా ఉంటారు. అందుకే షో మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీతో ఉంటూ హౌస్ మేట్స్ లో ఎనర్జీ నింపుతున్నారు.

స్నేహం మన కన్నా సీనియర్స్ తో చనువుగా ఉండలేము. అన్ని విషయాలు చెప్పుకోలేము. అందుకే ఎన్టీఆర్ స్నేహ మంత్రం అందుకున్నారు. మంచి మిత్రుడిగా హౌస్ మేట్స్ తో కలిసిపోయి వారి మనసులోని మాటను బయటికి రప్పిస్తున్నారు. షోని విజయవంతం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus