రంగస్థలం శాటిలైట్ రైట్స్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • March 21, 2018 / 07:50 AM IST

ధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం” (Rangasthalam) సినిమా చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. చరణ్ కి జోడిగా తొలిసారి సమంత నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే ధరపలికింది.

టీవీ వర్గాలవారు  తెలిపిన సమాచారం ప్రకారం తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు సుమారు 20 కోట్లకు పైగానే అమ్ముడవగా, హిందీ శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ హిందీ ఛానెల్ 10.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఆడియో హక్కులు కూడా భారీగానే పలికాయి. 1.5 కోట్లకు ఓ మ్యూజిక్ కంపెనీ సొంతం చేసుకున్నట్టు టాక్. దీని బట్టి రంగస్థలం సినిమాకి ఎంత క్రేజ్ ఉందొ అర్ధమవుతోంది.  మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా మార్చి 30 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus