రియల్‌ షకీలాపై రీల్‌ షకీలా కామెంట్స్‌

  • December 29, 2020 / 02:24 PM IST

‘షకీలా’ ట్రైలర్‌ విడుదల అయినప్పటి నుంచి అంతా చిత్రబృందం మీద కామెంట్స్‌ చేసేవాళ్లే. షకీలా కథను తమకు నచ్చినట్లు తీసేస్తున్నారు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బయటకు చెప్పుకోలేకపోయినా చాలామంది షకీలా అభిమానులు ఇదే ఆలోచన ఉన్నారు. షకీలా కథను ఉన్నది ఉన్నట్లు చూపించడం లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో షకీలాగా నటిస్తున్న రిచా చద్దా ఇప్పుడు షకీలా గురించి కామెంట్స్‌ చేస్తోంది. ‘షకీలా’ సినిమా ప్రచారాన్ని చిత్రబృందం ఇటీవల ప్రారంభించింది.

హిందీలో ఇప్పటికే విడుదలైన సినిమాను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో బోల్తాపడిన ఈ సినిమా తెలుగులో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. షకీలా గురించి పూర్తిగా స్టడీ చేయకుండా చిత్రబృందం సినిమా తీసేసింది అనే ఆరోపణల మధ్యలో షకీలా గురించి రిచా చద్దా స్పందించింది. షకీలాలా కనిపించాలని ఈ సినిమా కోసం నేను కొంచెం బరువు పెరిగాను అంటూ సినిమా కోసం తనలో వచ్చిన మార్పు గురించి చెప్పింది రిచా.

షకీలాకు అడల్ట్‌ చిత్రాల్లో నటించాలనే ఆలోచన లేదు. అయితే డబ్బుల కోసమే అలాంటి సినిమాలు చేసింది. వాళ్లమ్మ ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా షకీలాను నటిగా మారమని బలవంతం చేశారు. దీంతో ఆమె డబ్బుల కోసమే ఇండస్ట్రీలోకి వచ్చారు అని చెప్పింది రిచా చద్దా. ఈ విషయం చాలామందికి తెలిసిందే… కొత్తగా రిచా ఏం చెప్పలేదు.. సినిమాలోనూ చూపించలేదు ప్చ్‌…

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus