దాదాపు పతియేకేళ్లుగా లక్ష్మీ నారాయణ చిత్ర పరిశ్రమలో ఉంటున్నారు. ఆయన్ని చూస్తే గుర్తు పట్టడమే మినహా పేరు అంతగా తెలియదు. ఎప్పుడో వచ్చిన మనీ సినిమా నుండి ఆయన సైడ్ విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికి వందల చిత్రాలలో నటించి ఉంటారు. స్క్రీన్ పై విలన్ లా కనిపించే ఈ టాల్ ఫెలో గుండె మాత్రం చాలా సున్నితం అని నిరూపించుకున్నాడు. లక్ష్మీ నారాయణ ఓ పేద బ్రాహ్మణుడి పరిస్థితి తెలుసుకొని చలించిపోయాడు.
ఆయనకు పెద్ద సాయం చేసి మంచి మనసులు చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా అనేక దేవాలయాలు మూసి వేయడం జరిగింది. దాని వలన అనేక మంది అర్చకుల, పురోహితుల జీవితాలు దుర్భర స్థితికి చేరాయి. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చే కానుకలు పై ఆధారపడి బ్రతికే బ్రాహ్మణులు ఉపాధి కోల్పోయారు. అలాంటి వారిలో ఓ పేద బ్రాహ్మణుడు ఎటువంటి గత్యంతరం లేక కుటుంబ పోషణ కోసం జోలిపట్టి ఆడుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యాక్టర్ లక్ష్మీ నారాయణ చలించి పోయారు.
ఆయనను వెతికి మరి పట్టుకొని కొన్ని నిత్యావసర వస్తువులతో పాటు ఓ 25 వేల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. లక్ష్మీ నారాయణ చేసిన ఈ పనిని సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందిస్తున్నారు. సాయం చేసే గుణం ఉండాలేగాని కోట్ల కోటీశ్వరులు కావలసిన అవసరం లేదని నిరూపించారు.