అందుకే రెజినా ‘లెస్బియన్’ గా నటించిందట..!

టాలీవుడ్, కోలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించినప్పటికీ స్టార్ ఇమేజ్ ని మాత్రం సాధించలేకపోయింది రెజినా. తెలుగులో రవితేజ ,సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, వంటి హీరోల సరసన నటించినప్పటికీ… స్టార్ హీరోలు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది రెజినా. ఇటీవల ఓ బోల్డ్ క్యారెక్టర్‌తో బాలీవుడ్‌లో ప్రత్యక్షమైంది. అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. ఈ చిత్రంలో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్‌కు ప్రియిరాలుగా రెజీనా నటించింది. ఫిబ్రవరి 1 న విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అయితే దక్కాయి కానీ… హిట్ టాక్ ని మాత్రం సొంతం చేసుకోలేక డీలా పడిపోయింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో రెజీనా ఈ చిత్రం గురించి తన అనుభూతిని తెలిపింది రెజినా. ఈ క్రమంలో రెజినా మాట్లాడుతూ… `నేను ద‌క్షిణాదికి మాత్ర‌మే ప‌రిమితం అవ్వాల‌నుకోవడం లేదు. అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తా. న‌టిగా ఎలాంటి పాత్ర‌లో కనిపించడానికి నేను సిద్ధం. అందుకే లెస్బియ‌న్‌గా న‌టించ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. అయినా అందులో త‌ప్పేం ఉంది. సుప్రీంకోర్టు కూడా అంగీక‌రించింది. మ‌నం 21వ శ‌తాబ్దంలో ఉన్నాం. ఎవ‌రు ఎలా కావాలంటే అలా జీవించే స్వేచ్ఛ ఉంది. లెస్బియ‌న్ల‌ను స‌మాజం కూడా అంగీక‌రిచాలి` అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘తనకి కొంతమంది హోమో సెక్సవల్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారికి.. నీతి సూత్రాలు చెప్పటం మానాలి, మార్పు రావాలి’ అంటూ రెజినా సందేశాలిస్తుంది. ఇక ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ.. రెజినాకి మాత్రం మంచి పేరు వచ్చింది. దీంతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కుతాయని రెజినా ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus