ఆ హీరోయిన్ తో ఎఫైర్… క్లారిటీ ఇచ్చిన తేజూ..!

గతంలో మెగా మేనల్లుడు సాయి తేజ్, హీరోయిన్ రెజీనా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వీరు పెళ్ళిచేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తేజు మొదటి చిత్రమైన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది రెజీనా. అంతే కాదు వీరిద్దరూ కొన్ని ఈవెంట్లలో కూడా కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలొచ్చాయి. అయితే మళ్ళీ వీరిద్దరూ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు కూడా..! అయితే తేజు ఈ వార్తలకి బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఇప్పటికి ఈ విషయం మర్చిపోలేదనుకుంట. తాజాగా తేజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రెజీనా పై పరోక్షంగా స్పందించాడు.

తేజు ఈ విషయం పై స్పందిస్తూ… ” నేను అప్పట్లో ఓ హీరోయిన్ తో ఏవేవో అని రూమర్లు పుట్టించేసారు. ఆ రూమర్స్ వలన ఆ హీరోయిన్ కెరీర్ నాశనమతుందేమో అని భయపడి సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాను. మా మధ్య స్నేహం పాడవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమెకు కావాలని దూరంగా ఉంటూ వస్తున్నాను. ఆమె నా మొదటి సినిమా హీరోయిన్. ఆమె అంటే నాకు గౌరవం ఉంది. నా మొదటి సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు ఎంత స్పెషలో.. ఆ హీరోయిన్ కూడా నాకు అంతే స్పెషల్. అందుకే అలా చనువుగా ఉండేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు తేజు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus