యువ కథానాయకుడు విశ్వక్సేన్‌కి కోపం ఎక్కువ. అయితే అది తనకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే చూపిస్తారు అంటుంటారు. అయితే ఈ క్రమంలో ఆయనను తప్పుగా అంచనా వేస్తుంటారు అనే అపవాదు కూడా ఉంది. ఇప్పుడెందుకు ఈ విషయం గురించి చర్చా అనుకుంటున్నారా? మరోసారి విశ్వక్సేన్‌కి కోపం వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆ వైరల్ పోస్టు చూస్తుంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా విడుదల తేదీ గురించి అని అర్థమవుతోంది. ఇంతకీ ఏమైందంటే…
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా గురించి టీమ్ చాలా రోజుల క్రితమే ప్రచారం ప్రారంభించింది. వివిధ కారణాల వల్ల, చాలా మార్పుల తర్వాత సినిమాను డిసెంబరు 8న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్‌ను కూడా మారుస్తున్నారు అంటూ ఓ ప్రచారం మొదలైంది. ఈ సమయంలో విశ్వక్‌సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారు అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాను తొలుత అనుకున్న తేదీకే విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. డిసెంబర్ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లిపై ఒట్టు. మహాకాళి మాతో ఉంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అంతేకాదు డిసెంబర్‌లో కనుక (Gangs of Godavari) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రాకపోతే… ఇకపై తనను సినిమా ప్రమోషన్స్‌లో చూడరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే డిసెంబరు 8న ఎక్కువ సినిమాలున్నాయని సినిమా బృందం వేరే డేట్ కోసం చూస్తోందని ఓవైపు వార్తలొస్తున్నాయి. డిసెంబర్ 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అంటున్నారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థతో మాట్లాడుకోకుండా విశ్వక్‌సేన్ ఇలా ఎందుకు పోస్ట్ చేశారు అనే ప్రశ్న కూడా కనిపిస్తోంది.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!