తెలుగువారు మెచ్చిన పొరుగు కథలు

  • December 14, 2016 / 12:06 PM IST

ఒక భాషలో విజయవంతమైన కథతో మరో భాషలో సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని. వర్జినల్ మూవీ కంటే బాగా తీయగలగాలి. ఏ భాషలో రీమేక్ చేస్తున్నామో అక్కడి సమాజానికి కనెక్ట్ అయ్యేలా కథలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు లో కాస్త ఎక్కువైనా, తక్కువైనా సక్సస్ లో మార్పులు వస్తాయి. మన దర్శకులు అలాంటి సాహసాన్ని చేసి పరాయి కథలతో తెలుగులో సూపర్ హిట్ తెలుగు సినిమాలను అందించారు. అటువంటి వాటిలో టాప్ టెన్ గా నిలిచిన చిత్రాలపై ఫోకస్…

1. నట్టమై / పెదరాయుడుడైలాగ్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన పెదరాయుడు తెలుగులో 200 రోజులు ఆడింది. ఇది అచ్చమైన తమిళ కథ. కోలీవుడ్ లో శరత్ కుమార్ చేసిన “నట్టమై” సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో 175 రోజులు ఆడిన ఈ చిత్రం తెలుగులో అంతకంటే విజయం సాధించింది.

2. ట్విన్ డ్రాగన్స్ / హలో బ్రదర్కింగ్ నాగార్జున నటించిన హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. ఇది మనదేశానికి చెందిన కథే కాదు. జాకీచాన్ నటించిన హాంకాంగ్ మూవీ నుంచి వచ్చింది. మూల కథను మాత్రమే తీసుకొని ఈవీవీ సత్యనారాయణ తెలుగు ప్రజలకు తగినట్లుగా పూర్తిగా మార్చి తెరకెక్కించారు. రెండు చోట్ల ఈ చిత్రం సూపర్ హిట్.

3. చిన్న తంబీ / చంటిప్రభు, కుష్బూ జంటగా నటించిన తమిళ సినిమా “చిన్న తంబీ”. 1991 లో రిలీజ్ అయిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ కథను తెలుగులో చంటిగా తీశారు. ఇందులో వెంకటేష్ అమాయకుడిగా నటించి లేడీస్ ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. కుష్బూ పాత్రను తెలుగులో మీనా చక్కగా పోషించి సినిమా సూపర్ హిట్ కావడానికి దోహదం అయ్యారు.

4. అనురాగ అరళితు / ఘరానా మొగుడుతెలుగు నవలలతో చిరంజీవి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఘరానా మొగుడు చిత్రం కూడా నవల నుంచి రూపొందిన సినిమానే. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే .. అది తెలుగు నవల కాకపోవడం. కన్నడ నవలను తీసుకొని రాజ్ కుమార్ అనురాగ అరళితు అనే సినిమా తీసి హిట్ అందుకున్నారు. ఆ చిత్రాన్ని రజనీకాంత్ తమిళంలో రీమేక్ చేయగా, తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేశారు. మూడు భాషల్లో ఈ కథ సూపర్ హిట్.

5. ఖుషి / ఖుషిపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్ హిట్ గా నిలిచిన చిత్రం ఖుషి. ఇది కూడా తమిళ కథే. కోలీవుడ్ లోను ఖుషి గానే రూపొందింది. విజయ్, జ్యోతిక నటించిన చిత్రం యువతను ఉర్రూతలూగించింది. ఆ చిత్ర డైరక్టర్ ఎస్.జె. సూర్య తెలుగులో పవన్ తో ఖుషిని మళ్లీ హిట్ చేయించారు.

6. అప్పు / ఇడియట్కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ సినీ ఇండస్ర్టీలో అప్పు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ యువతకు తెగ నచ్చింది. అదే కథతో అదే ఏడాది మాస్ మహారాజ్ రవితేజతో ఇడియట్ గా రీమేక్ చేశారు. ఈ చిత్రం రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చింది.

7. రమణ / ఠాగూర్తమిళ యాక్షన్ హీరో విజయ్ కాంత్ నటించిన రమణ కోలీవుడ్ లో రికార్డులను బ్రేక్ చేసింది. ఏఆర్ మురుగదాస్ అవినీతిపై పోరాడే వ్యక్తి రమణ గురించి చూపించిన విధానం అందరికీ భలే నచ్చింది. నచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తాను హీరో గా ఠాగూర్ పేరుతో రీమేక్ చేశారు. తమిళ వెర్షన్ లో హీరో చివరికి చనిపోతాడు.. తెలుగులో ఆలా జరగకుండా మార్పులు చేశారు. కథలో మార్పు జరిగింది కానీ ఈ చిత్రం రికార్డులు తిరగరాయడంలో మార్పే జరగలేదు.

8. మున్నాభాయ్ M.B.B.S / శంకర్ దాదా M.B.B.Sబాలీవుడ్ హీరో సంజయ్ దత్ మున్నాభాయ్ M.B.B.S గా అభిమానుల జేజేలు అందుకున్నారు. అదే కథకు మెగాస్టార్ చిరంజీవి తన కామెడీ టైమింగ్ ని జోడించి శంకర్ దాదా M.B.B.S గా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఓ వైపు యాక్షన్, మరో వైపు కామెడీ కలిసిన ఈ మూవీ చిరు వంద రోజుల చిత్రాల జాబితాలో చేరింది.

9. దబాంగ్ / గబ్బర్ సింగ్ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. బ్యాడ్ అంటే నిజమైన బ్యాడ్ కాదు అదోరకం. అలాంటి పోలీస్ కథతో సల్మాన్ ఖాన్ దబాంగ్ (2010 ) తీసి హిట్ కొట్టారు. ఆ చిత్ర కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా తెలుగు వారికి చూపించారు. కథ బలం, పవన్ క్రేజ్ కలిసి ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పదేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ మళ్లీ హిట్ బాట పట్టించింది.

10. ప్రేమమ్ / ప్రేమమ్మొదట మలయాళంలో రూపుదిద్దుకున్న “ప్రేమమ్” 2015 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత ఏడాది మల్లూవుడ్ లో అత్యధిక కలక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దాదాపు 60 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్నిఈ ఏడాది తెలుగులో నాగ చైతన్యతో ప్రేమమ్ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా యువత ఈ ప్రేమ కథకు ఫిదా అయిపోయారు. సూపర్ హిట్ చేశారు.

తని ఒరువన్ / ధృవ జయం రవి హీరోగా నటించిన తమిళ చిత్రం “తని ఒరువన్”. పూర్తిగా మైండ్ గేమ్ తో సాగే ఈ స్టోరీ అందరికీ తెగ నచ్చింది. కోలీవుడ్ లో 105 కోట్లను వసూల్ చేసింది. ముఖ్యంగా హీరో, విలన్ పాత్రలను డిజైన్ చేసిన విధానం నచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా తెలుగు అనువాదంలో నటించేందుకు ఒకే చెప్పారు. ఇలా చెర్రీ తొలి సారి చేసిన రీమేక్ మూవీ ధృవ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus