The Raja Saab: ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాలు పెంచేస్తున్న మారుతి.. కానీ?

Ad not loaded.

ప్రభాస్  (Prabhas)  సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ మరో ఆరు నెలల్లో ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ది రాజాసాబ్ (The Raja Saab) మూవీలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఈ సినిమాలో ఒక హిందీ సాంగ్ ను రీమిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. 40 సంవత్సరాల క్రితం హిట్టైన ఒక సాంగ్ ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారని భోగట్టా. ది రాజాసాబ్ సినిమా 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖచ్చితంగా మెప్పించేలా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ లుక్ ఈ సినిమాలో కొత్తగా ఉంటుందని ప్రభాస్ డ్యాన్స్ స్టెప్స్ కూడా అదుర్స్ అనిపించడం ఖాయమని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.

ది రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా కల్కి ఫుల్ రన్ పూర్తైన వెంటనే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ మూవీకి థమన్ (S.S.Thaman)  మ్యూజిక్ అందిస్తుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు పేరుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus