రేణూ దేశాయ్ పేరు మార్చుకోవడానికి అసలు కారణం అదే..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా పేరు మార్చుకుంది. అయితే దీని వాళ్ల ఏదో కలిసొస్తుందనే ఉద్దేశంతో కాదట. కేవలం క్రియేటివ్ గా కొత్తగా ఉంటుందనే భావనతో మాత్రమే.. పేరుని మార్చుకున్నానంటుంది రేణూ. నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. తాజాగా కవితా రచయితగా కూడా మారిపోయింది. రేణూ రాసిన కవితల్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ కవితాలన్నిటినీ కలిపి ఓ పుస్తకంగా మలిచింది.

ఇక ఈ పుస్తకంలో మొత్తం 31 కవితలు ఉన్నాయట.. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ కవితలు ఉన్నాయట. ఇందులో 15 కవితలను తెలుగులోకి అనంత శ్రీరామ్ అనువదించారని రేణూ చెప్పింది. ‘ది లవ్ అన్ కండీషనల్’ అనే పేరుతో ఈ పుస్తకం రూపొందింది. ఈ పుస్తకంలో రేణు తన పేరు ను మార్చడం గమనార్హం. రే ను(Ray Nu) అని పెన్ నేమ్ గా తన పేరును మార్చుకుంది రేణూ . ఇక ఈ పుస్తకానికి మంచి రెప్సాన్స్ వస్తుండడం విశేషం. రేణూ తన పేరు మార్చుకోవడానికి ముఖ్య కారణం వివరిస్తూ… “ఎందుకనో నాకు నా పేరు అంటే ఇష్టం ఉండదు, మా అమ్మమ్మ మా వాళ్ళందరికీ పేర్లు పెట్టింది. అందరికి కాస్తంత క్రియేటివ్ పేర్లే పెట్టింది. అయితే నాకు పెట్టిన పేరుతో నేను డిజప్పాయింట్ అయ్యాను. కాబట్టి నేను కొత్త పేరును ట్రై చేస్తున్నాను, కొద్దిగా కవితాత్మకంగా ఉంటుందీ పేరు అని భావిస్తున్నా,” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus