Renu Desai: అకిరాను అలా పిలవడం పవన్‌కి ఇష్టం లేదు.. రేణు దేశాయ్‌ క్లారిటీ!

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమా రిలీజ్‌ అయితే ఫ్యాన్‌ బాయ్‌లాగా PSPK టీషర్ట్‌ వేసుకొని మరీ థియేటర్‌లో సినిమా చూస్తాడు అకిరా నందన్‌. అదేముంది తండ్రి కదా ఎవరైనా చూస్తారు అని అనొచ్చు. అయితే ఎంతమంది హీరోల తనయులు అలా బయటకు వచ్చి, అభిమానుల మధ్య సినిమాలు చూస్తున్నారో మీరే చూసుకోండి. ఇప్పుడు పవన్‌ పొలిటికల్‌ సెకండ్‌ ట్రయల్‌లో జర్నీ సూపర్‌ హిట్‌ అయిన సందర్భంగా మళ్లీ అకిరా వచ్చాడు. దీంతో చాలామంది అభిమానులు, నెటిజన్లు అకిరాను ‘జూనియర్‌ పవర్‌ స్టార్‌’ అని అంటున్నారు.

ఈ మాట చాలా బాగున్నా.. తల్లి రేణు దేశాయ్‌ (Renu Desai ) మాత్రం ఒప్పుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్‌ అనంతరం తనయుడు అకిరాను అందరికి పరిచయం చేస్తున్నాడు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఫ్యామిలీతో సహా కలిసి భేటీ అయ్యారు. ఇక్కడ కూడా అకిరా పవన్‌ వెంటే ఉన్నాడు. దీంతో అంతా ఇప్పుడు అకిరాను PSPK2 అని, జూనియర్‌ పవర్‌ స్టార్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరికొందరైతే ‘నాన్న పాలిటిక్స్‌ చూసుకుంటాడు.. నువ్వు హీరో అయిపో’ అంటున్నారు. అభిమానుల కామెంట్స్‌పై రేణు దేశాయ్‌ స్పందించారు. అకిరాను జూనియర్‌ పవన్‌ కల్యాణ్‌ అని అనడం, జూనియర్‌ పీకే అనడం, పీకే 2 అనడం ఇష్టం లేదని చెప్పారు. జూనియర్‌ పవన్‌ కల్యాణ్‌ అని అనిపించుకోవడం అకిరాకు, తన తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి తన ఫీలింగ్‌ని అర్థం చేసుకోని అకిరా నందన్‌ అని పిలవండి అని పోస్ట్‌ చేశారు రేణు దేశాయ్‌.

మరి ఆమె రిక్వెస్ట్‌ని ఫ్యాన్స్‌ ఎలా తీసుకుంటారో చూడాలి. ఇక అకిరా గురించి రేణు దేశాయ్‌ మాట్లాడుతూ పుట్టిన క్షణం నుండి తన అభిమానిగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు నటిస్తాడా నేను కూడా ఆసక్తికిగా ఎదురుచూస్తున్నాను. అయితే అతడి నిర్ణయాన్ని, మనోభావాల్ని గౌరవించాలి. కాబట్టి అకిరా సినీరంగ ప్రవేశంపై చర్చ తీసుకురావొద్దు. అని ఆమె చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus